Teluguwishesh ఐ (మనోహరుడు) ఐ (మనోహరుడు) Get AI | I Movie Review, AI | I Telugu Movie Review, AI | I Movie Ratings, Vikram AI | I Movie Review, Shankar AI | I Movie Review. Know AI | I Movie Updates. Product #: 59779 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఐ (మనోహరుడు)

  • బ్యానర్  :

    ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    శంకర్

  • నిర్మాత  :

    ఆస్కార్ రవిచంద్రన్ ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్

  • సంగీతం  :

    ఎ.ఆర్. రహ్మాన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    పి.సి. శ్రీరామ్

  • ఎడిటర్  :

    ఆంటొనీ

  • నటినటులు  :

    విక్రమ్ (హీరో), అమీజాక్సన్ (హీరోయిన్), సంతానం, శ్రీనివాసన్ తదితరులు

I Movie Review

విడుదల తేది :

2015-01-14

Cinema Story

లింగేష్ (విక్రమ్) అనే బాడీ బిల్డర్ మిస్టర్ ఇండియా అన్పించుకునేందుకు బాగా కష్టపడుతాడు. ప్రముఖ మోడల్ దియా (అమీ జాక్సన్) ను ప్రేమిస్తాడు. ఓ సారి యాడ్ ఫిలింలో నటించాలని దియా లింగేష్ ను కోరుతుంది. యాడ్ ఫిలింకు సంబంధించి మెలుకువలు కూడా కూడా నేర్పుతుంది. షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇదే సమయంలో దియా ను వెంబడించే శత్రువులు లింగేష్ శరీరంలోకి ఓ వైరస్ ను పంపిస్తారు.

లింగేష్ శరీరంలోకి ప్రవేశించే వైరస్ అతని జీవితంలో అనుకోని మార్పులను తీసుకొస్తుంది. ఈ సమస్య నుంచి లింగేష్ ఎలా బయట పడతాడు. దియాను కలుస్తాడా.. లేదా అనే మిగతా కథలను వెండితెరపై చూడండి.

cinima-reviews
ఐ (మనోహరుడు)

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. 180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు క్రియేట్ చేసింది. అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మూవీ ట్రైలర్, టీజర్లు, పాటలు, ఫొటోలు ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. ఈ స్పెషల్ మూవీలో విక్రమ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించాడు. అమీజాక్సన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ బ్యానర్స్ పై తెరకెక్కిన సినిమాకు ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఐ’ ఎలా ఉందో రివ్యూ మీకోసం అందిస్తున్నాం.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ విక్రమ్. మూవీలో చియాన్ నటన సూపర్ గా ఉంది. ప్రతి సన్నివేశం కోసం ఆయన పడిన కష్టం ఫలించింది. బాడీ బిల్డర్ గా, వింత మనిషిగా విక్రమ్ పోషించిన పాత్రలు చాలా బాగున్నాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే అమీజాక్సన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ పాత్రలో నటించిన ఉపెన్ పటేల్ మిగతా ఆర్టిస్టులు కూడా  తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా ప్లస్ పాయింట్స్ చూస్తే సినిమా ఓ విజువల్ వండర్ గా చెప్పవచ్చు. గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి నిపుణులు పనిచేయటంతో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటి చాలా బాగా వచ్చింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ ఎక్కువ సమయం. మామూలు కథను మూడు గంటల పాటు చూపించే సరికి ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడతారు. సమయం పెంచటం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తెలియదు కానీ.. డ్యూరేషన్ పెంచేందుకు అవసరం లేని చాలా సీన్లను పెట్టారు. అంతేకాకుండా కథను కూడా బాగా సాగదీశారు. సినిమాపై భారీగా ఉన్న అంచనాలు థియేటర్ లోకి వెళ్లిన గంట తర్వాత ఆవిరవుతాయి. ఆశించిన స్థాయిలో సినిమా ఉండదు. సినిమాను రెండు గంటల్లో ముగించేసి ఉంటే ప్రేక్షకులకు బోర్, ఇబ్బంది అనే ఫీలింగ్స్ వచ్చేవి కాదేమో.

శంకర్ కథ కంటే గ్రాఫిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాపై దెబ్బ పడింది. చాలా చోట్ల అవసరం లేని సీన్లను ఉంచారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా శంకర్ తన సినిమాలో పాటలను కూడా సరైన టైమింగ్ లో చూపించలేదు. సినిమాలో ఏదో ఉందని హైప్ క్రియేట్ చేసిన మూవీ యూనిట్ దాన్ని చూపించటంలో మాత్రం విఫలం అయ్యారు. ప్రేక్షకులకు సినిమాను కనెక్ట్ చేయకుండా ఏదో ఒక షో లా చూపించారు. ఇక సెకండ్ ఆఫ్ లో కథలో ట్విస్ట్ తెలిసిపోగానే ప్రతి సీన్ ఊహించేయవచ్చు. ప్రేమకోసమే సినిమా అంతా ఉన్నప్పటికీ లవ్ సీన్లు మాత్రం సరిగా చిత్రీకరించలేకపోయారు.

కళాకారుల పనితీరు :

మంచి కాన్సెప్టును తీసుకున్న శంకర్ ఆచరణలో విఫలం అయ్యాడు. లేనిపోని హంగులకు పోయి కథను చెడగొట్టుకున్నాడు. అటు అనవసర సీన్లతో సాగతీసి మరింత ఇబ్బంది పెట్టాడు. మిగతా వారి పని తీరు చూస్తే.., సినిమాలో సంగీతం చాలా బాగుంది. ఎ.ఆర్. రెహ్మాన్ అందించిన ట్యూన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రపీ పీ.సీ. శ్రీరామ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ ప్రతి సీన్ ను హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో షూట్ చేశాడు. చైనా సహా ఇతర ప్రాంతాల్లో తీసిన సీన్లు చాలా నీట్ గా వచ్చాయి.

విక్రమ్ కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ మెన్ పనితీరు కూడా బాగుంది. విక్రమ్ ను ప్రతి రోల్ లో పర్ ఫెక్ట్ గా చూపించేందుకు వీరు ఎంతో సహకారం అందించారని సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా డ్యూరేషన్ పై ఎడిటర్ దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అంతేకాకుండా చాలా సన్నివేశాలను తగ్గించినా సినిమాకు కాస్త ప్లస్ అయ్యేది. తమిళ్ లో తీసినా.., తెలుగు డబ్బింగ్ లో నాన్ సింక్ తేడాలు రాకుండా టెక్నిషియన్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణ విలువలు ఎక్ట్రా ఆర్డినరిగా ఉన్నాయి.

చివరగా : అంచనాలు  తలక్రిందులయ్యాయి.

Movie TRAILERS

ఐ (మనోహరుడు)

play