Teluguwishesh యమలీల 2 యమలీల 2 yamaleela 2 Movie Review Product #: 57529 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    యమలీల2

  • బ్యానర్  :

    క్రిష్వి ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    ఎస్.వి.కృష్ణారెడ్డి

  • నిర్మాత  :

    కె.వి.సతీష్

  • సంగీతం  :

    ఎస్.వి.కృష్ణారెడ్డి

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    శ్రీకాంత్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    కె.వి.సతీష్ (హీరో), దియా నికోలస్ (హీరోయిన్), మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, రావు రమేష్, ఉత్తేజ్ తదితరులు

Yamaleela 2 Movie Review

విడుదల తేది :

2014-11-28

Cinema Story

ఓ సారి యుముడు(మోహన్ బాబు), చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) మానస సరోవర యాత్ర కోసం వచ్చిన సమయంలో.., చిత్రగుప్తుడు తన చేతిలో ఉండే భవిష్యవాణి పోగొట్టుకుంటాడు. విషయం తెలుసుకున్న బ్రహ్మ పుస్తకం తీసుకుని దేవలోకానికా రావాలని అప్పటివరకు భూమిపైనే ఉండాలని ఆదేశిస్తాడు. దీంతో భూమిపైకి వచ్చిన యముడు, చిత్రగుప్తుడికి అంకాలజిస్ట్ అయిన క్రిష్ (సతీష్) దగ్గర ఈ పుస్తకం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రిష్ పుస్తకం తిరిగిచ్చేందుకు అంగీకరించడు. అందులోని కొన్ని విషయాలు అతడిని షాక్ కు గురిచేస్తాయి. ఇక ఇదే సమయంలో స్టీపెన్స్ (ఆశిష్ విద్యార్థి) క్రిష్ ను క్యాన్సర్, ల్యూకేమియాను నయం చేసే మందు కనుక్కోవాలని కోరుతాడు. క్రిష్ ఆ ఫార్ములా కనుక్కున్నాడా.., ఇంతకీ భవిష్యవాణిలో ఏముంది, చివరకు పుస్తకం యముడికి దక్కిందా లేదా అనేది వెండి తెరపై చూడండి.

cinima-reviews
యమలీల 2

తెలుగు ఎవర్ గ్రీన్ కామెడి సినిమాల్లో ఒకటైన ‘యమలీల’ మూవీ సీక్వెల్ ‘యమలీల2’ థియేటర్లలోకి వచ్చేసింది. కొద్దికాలంగా క్లీన్ కామెడికి దూరమైన తెలుగు ప్రేక్షకులకు హాయిగా నవ్వుకునే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. ఫ్యామిలి, ఎంటర్ టైనర్ సినిమాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి చాలా కాలం తర్వాత డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమా ఇది. కె.వి.సతీష్ ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. దయా నికోలస్ హీరోయిన్ గా నటిస్తే., మోహన్ బాబు యముడి పాత్ర పోషించాడు. సతీష్ తొలి సినిమానే విదేశాల్లో కావటం విశేషం. ఇక ఫుల్ టైం ఎంటర్ టైనర్ అనే అంచనాతో వచ్చిన సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

ప్లస్ పాయింట్లు :
ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీ ఎస్వీ కృష్ణారెడ్డి మార్కు కామెడి ఎంటర్ టైనర్ మూవీ. తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేందుకు మరో సినిమా దొరికిందని చెప్పవచ్చు. నటుడిగా పరిచయం అయిన కే.వి.సతీష్ పాత్రకు న్యాయం చేశాడు. అయితే బాడీ లాంగ్వేజ్ ఇంకా మార్చుకోవాల్సి ఉంది.  హీరోయిన్ దియా నికోలస్ కూడా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. యముడిగా నటించిన మోహన్ బాబు తానేంటో మరోసారి సత్తా చాటాడు. సినిమాకు ఈయనే హైలైట్ అని చెప్పవచ్చు. రావు రమేష్, షియాజి షిండే, కోట సహా మిగతా నటులు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు :
ఈ సినిమాలో కొత్తదనం కొరవడింది. పాత ‘యమలీల’ కాన్సెప్టునే పెట్టి సినిమా తీసినట్లు స్పష్టం అవుతోంది. చాలా సీన్లు ప్రేక్షకులు ముందే ఊహించగలరు. భవిష్యవాణి పోగొట్టుకోవటం దగ్గర్నుంచి ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఫస్ట్ ఆఫ్ పార్ట్ పర్వాలేదు అన్పించినా.., సెకండ్ పార్ట్ మాత్రం చాలా సాగతీసినట్లుగా ఉంటుంది. సెకండ్ ఆఫ్ ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. అదేవిధ:గా యముడు-చిత్రగుప్తుడి మద్య వచ్చే సన్నివేశాలకు కూడా డైలాగులు సరిగా లేవు.

Cinema Review

‘యమలీల2’ను కొత్తగా చూపించటంలో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అంతా పాత కథను పోలి ఉంది. కామెడి సన్నివేశాలు కూడా సరిగా లేవు. డైలాగులపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. ఇక మిగతా విభాగాల పనితీరు చూస్తే.., సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భూలోకం, యమలోక సన్నివేశాలు చాలా నీట్ గా చూపించారు. అదేవిధంగా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. క్రిష్వి ఫిలిమ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ప్రేక్షకులు కోరుకున్నంతగా ఏమి లేదు.

Movie TRAILERS

యమలీల 2

play