Teluguwishesh అల్లుడు శ్రీను అల్లుడు శ్రీను Alludu Seenu Telugu Movie Review, Alludu Seenu Movie Review, Alludu Seenu Movie Review and Rating, Alludu Sreenu Review, Telugu Movie Alludu Seenu Review, Alludu Seenu Movie Stills, Alludu Seenu Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 54726 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అల్లుడు శీను

  • బ్యానర్  :

    శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్

  • దర్శకుడు  :

    వివి వినాయక్

  • నిర్మాత  :

    బెల్లంకొండ సురేష్

  • సంగీతం  :

    దేవీ శ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ఛోటా కే నాయుడు

  • ఎడిటర్  :

    గౌతమ్ రాజు

  • నటినటులు  :

    బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు

Alludu Seenu Movie Review

విడుదల తేది :

25-07-2014

Cinema Story

ఒక చిన్న గ్రామం నుంచి సినిమా కథ మొదలవుతుంది. అల్లుడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్), తన మామయ్య నరసింహా (ప్రకాష్ రాజ్) ఇద్దరూ కలిసి అందరి దగ్గర అప్పులు చేస్తుంటారు. వారికి తిరిగి డబ్బులు ఇవ్వకపోగా వారినుంచి తప్పించుకుని చెన్నైకి వెళ్లపోవాలనే ప్లాన్ వేసుకుంటారు. కానీ వారెక్కిన ట్రైన్ చెన్నైకి కాకుండా హైదరాబాద్ సిటీకి చేరుకుంటుంది. వారిద్దరూ హైదరాబాద్ కు చేరిన అనంతరం అల్లుడు శీను తన నరసింహా మామలాగే వుండే భాయ్ (ప్రకాష్ రాజ్)ను చూస్తాడు. అతను దందాలు, సెటిమెంట్లు చేస్తుంటాడు. ఇతనికి పీఏ డింపుల్ (బ్రహ్మానందం).

అప్పుడే అల్లుడు శీను ఈజీగా డబ్బులు సంపాదించుకునే ఒక పథకాన్ని అమలు చేసుకుంటాడు. తన మామ నరసింహను భాయ్ లా వుండే గెటప్ వేసి, భాయ్ పీఏ డింపుల్ ద్వారా చిన్నచిన్న దందాలను సెటిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఆ సమయంలోనే భాయ్ కూతురు అంజలి (సమంత)ని చూసి అల్లుడు శీను ప్రేమలో పడిపోతాడు. అంజలి ప్రేమను గెలుచుకోవడానికి శీను ఎన్నో ప్రయత్నాలు చేయగా... చివరికి సమంత కూడా అతని ప్రేమలో మునిగిపోతుంది. ఈ క్రమంలోనే భాయ్ కి నరసింహ గురించి తెలుస్తుంది.

ఇక ఇక్కడి నుంచి కథలో ఒక కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. అసలు ఒకేలా వుండే నరసింహ-భాయ్ కి మధ్య వున్న సంబంధం ఏంటి..? వీరిద్దరి మధ్య వున్న సంబంధం గురించి తెలుసుకున్న అల్లుడు శీను ఏం చేశాడు..? తాను ప్రేమించిన అంజలిని ఎలా దక్కించుకుంటాడు..? అనే విషయాల గురించి తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే!

cinima-reviews
అల్లుడు శ్రీను

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ‘అల్లుడుశీను’. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, తమన్నా ఓ ఐటెం సాంగులో నటించింది. కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్, ఛోటా కె నాయుడు వంటి భారీ సాంకేతిక నిపుణులతో నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అల్లుడుశీనుకి ఎలాంటి విజయాన్ని అందించనుందో ఒకసారి చూద్దాం.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు తెరకు ఎంట్రీ అయిన తన మొదటి చిత్రంలోనే మాంచి ఎనర్జిటిక్ లెవెల్స్ ను కనబరిచాడు. సాధారణంగా వినాయక్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలాఎక్కువగానే వుంటాయి. అయినాగానీ శ్రీనివాస్ ఏమాత్రం జంకకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా బాగా రాణించాడు. ఇక డ్యాన్స్ తో కూడా ప్రేక్షకులకు బాగానే అలరించాడు.
ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం విషయానికి వస్తే... చాలావరకు ఈయన లేకపోతే అసలు సినిమానే లేదని చెప్పుకోవాలి. సినిమాలో ఆయన కనిపించిన ప్రతీ సీన్ లో తన హావాభావాలతో, జోక్ సీన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు.

హీరోయిన్ సమంత విషయానికి వస్తే.. ఈ సినిమాలో సమంత పాత్ర తక్కువగా వున్నప్పటికీ.. నటించిన కొన్ని సన్నివేశాల్లోనూ తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ముఖ్యంగా పాటలతోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా తన అందాలను ఆరబోస్తూ, సాధ్యమైనంతవరకు తన గ్లామరస్ హాట్ అందాలను పరిచేసింది. ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే.. ఆయన భాయ్, నరసింహ వంటి ద్విపాత్రాభినయం పాత్రల్లో మంచి నటనను కనబరిచాడు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నర్తించినా తమన్నా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. మిగతా సహచర పాత్రల్లో నటించిన రవిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు, ప్రదీప్ రావత్, ఇంకా తదితర నటులందరూ తమతమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. క్లైమాక్స్ లో ఛేజింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా భారీ ఖర్చుపెట్టి, రిచ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

మైనస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ సినిమా కథే ఒక పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. ఈ తరహా కథాంశంతోనే గతంలో చాలా సినిమాలు వచ్చాయి. స్ర్కీన్ ప్లే కూడా అంతగా బాలేదు. ఎందుకంటే.. కథలో ట్విస్ట్ రివీల్ అయిపోగానే తరువాత జరగబోయే సన్నివేశాల గురించి ప్రేక్షకులకు ఇట్టే అర్థమైపోతుంది. చాలా సీన్స్ రొటీన్ గా వుంటే.. మరికొన్నని చాలా బోర్ కొట్టేలా అనిపిస్తాయి. పాటలకోసం బాగానే ఖర్చు చేసినప్పటికీ వాటి లొకేషన్స్ ను మాత్రం సరిగ్గా ఎంచుకోలేదు. సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అకనిపిస్తుంది. ముఖ్యంగా పాటలు వెనువెంటనే వుండటం వల్ల బోర్ కొడుతుంది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే.. ఈ సినిమాకి బ్రహ్మానందం కామెడీ ఒక్కటే హైలైట్ అయితే.. మిగతావారు ఎంతా ట్రై చేసిన అంతగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

నిర్మాత ఖర్చు పెట్టిన తగ్గట్టుగానే ఛోటా కే.నాయుడు తన సినిమాటోగ్రఫీతో మంచి విజువల్స్ నే చూపించాడు. ముఖ్యంగా విదేశాల్లో తీసిన పాటలు గ్రాండ్ గా కనిపించేలా చూడగా.. మరికొన్ని సన్నివేశాల దగ్గర సూపర్బ్ విజువల్స్ ను కనబరిచాడు. దేవీశ్రీప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. ఎప్పటిలాగే తాను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ కి బాగా హెల్ప్ అయితే.. కంటెంట్ లేని సీన్స్ కి మాత్రం సంగీతం ఎందుకు ఇచ్చాడోనని అనిపిస్తుంది. కోన వెంకట్ డైలాగులు జస్ట్ ఓకే అయినా బ్రహ్మానందం కోసం సిట్యుయేషనల్ గా రాసుకున్న డైలాగులు మాత్రం అదిరిపోయే రేంజిలో వున్నాయి.

గౌతంరాజు ఆడియెన్స్ కి బోర్ కొట్టకుండా ఎడిటింగ్ లో చాలా జాగ్రత్తలు పాటించాడు. కెఎస్ రవీంద్ర అందించిన కథ పాతదే! గోపీ మోహన్ - వివి వినాయక్ కలిసి రాసుకున్న స్ర్కీన్ ప్లే కూడా అంతంతమాత్రంగానే వుంది. డైరెక్టర్ వివి వినాయక్ తన మార్క్ పోకుండా మాంచి కమర్షియల్ గా సినిమాను తెరకెక్కించాడు. ఇక ఖర్చు విషయానికి వస్తే అన్ని సీన్లలో ఏమాత్రం తగ్గకుండా బాగా రిచ్ గా తీశారు. ముఖ్యంగా పాటలకోసం అదిరిపోయే రేంజిలో సెట్ లు వేశారు.

చివరగా... కథ అంతంత మాత్రమే అయినప్పటికీ వివి వినాయక్ తన ప్రతిభతో కమర్షియల్ అంశాలను జోడించి ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమాతోనే పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా ఇతర చిత్రాలు లేకపోవడం వల్ల కలెక్షన్లు కూడా బాగానే వస్తాయని భావించవచ్చు.
‘‘భారీగా ఖర్చుపెట్టిన ‘‘బెల్లా’’నికి కొంచెం తీపి తగ్గడంతో చీమలు స్లోగా వస్తున్నాయి.’’