మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పరోక్షంగా కామెంట్ చేశారు. ఇటీవల జరిగిన హస్తం ఫలితాలను ద్రుష్టిలో పెట్టుకోని రాయపాటి ఇలాంటి చౌకబారు కామెంట్ చేసినట్లుగా రాజకీయ నాయకులు అంటున్నారు. అధిష్టానం దగ్గర నుండి ఏం ప్రకటన వచ్చిందో గానీ , రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావుల చేత రాజీనామా ప్రక్రియా జరిపించటం జరిగింది. కానీ ఆ ప్రక్రియా ఇంక పూర్తికాలేదు. వారు చేసిన రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించినట్లుగా ప్రకటన రాని విషయం తెలిసిందే.
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న మంత్రులలో మంత్రి కన్నా లక్ష్మీనారాయాణ ఒకరు. రీసెంట్ గా చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ స్పదించిన విషయం తెలిసిందే. మళ్లీ రాయపాటి సాంబశివరావు కూడా అదే జీవో మీదనే ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. మిగిలిన మంత్రుల మీద కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని రాయపాటి చూసినట్లు గా ఉందని కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు అంటున్నారు. అసలే కన్నాకు రాయపాటికి మద్య పచ్చగడ్డి మండుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో రాయపాటి కళంకిత మంత్రులపై కామెంట్ చెయ్యటం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం కన్నా లక్ష్మీ నారాయణ ను టార్గెట్ చేసుకోని , రాయపాటి ఈ రోజు మీడియా మాట్లాడినట్లు గా ఉందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో చెవులు కొరుకుంటున్నారు. ఈ ఇద్దరి మద్య అదిపత్యం పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అన్నీ విషయాలు అధిష్టానం చూస్తున్న సమయంలో రాయపాటి విమర్శలు ప్రతిపక్షలకు ఆయుధంగా మారుతాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇప్పటికీ కన్నా పేరు సిబిఐ వద్ద ఉన్న విషయం తెలిసిందే.అయితే సిబిఐ వారు ఎప్పుడు ఎవరిని పిలుస్తారో ఆరుగురు మంత్రులకు తెలియకుండా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొదటవిడతలో హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 7వ తేది సీబిఐ కోర్టులో హాజరుకావల్సి ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని ప్రతిపక్షలు, విపక్షలు డిమాండ్ చేస్తున్న సమయంలో రాయపాటి సాంబశివరావు ఇలాంటి విమర్శలు చెయ్యటం కాంగ్రెస్ పార్టీ పెద్ద నష్టమే అని రాజకీయ విమర్శకులు అంటున్నారు. రాయపాటి కామెంట్ వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more