విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో నాకు ‘ఇష్క్’ సినిమా చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఈ విజయం కోసమే నేను ఇన్నేళ్లుగా ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తూ వస్తున్నాను. ఫైనల్‌గా దేవుడు, ప్రేక్షకులు ఇప్పుడు నన్ను కరుణించారు అని నితిన్ మెరిసే కళ్లతో ఎంతో సంబరంగా చెప్పారు. నితిన్, నిత్యామీనన్ జంటగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇష్క్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
ఒక దశలో నేను వరుసగా మాస్ సినిమాలే చేశాను. ఆ సమయంలోనే నాకు మంచి ప్రేమకథ చేయాలనిపించింది. చాలా ప్రేమకథలు విన్నాను కానీ, ఏవీ నచ్చలేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తమిళ దర్శకుడు విక్రమ్‌కుమార్ చెప్పిన ప్రేమకథ గుర్తుకొచ్చింది. అప్పుడు నేను వేరే ప్రాజెక్టుల బిజీలో ఉండి చేయలేకపోయాను. విక్రమ్‌ను పిలిపించాను. లక్కీగా ఈ కథ ఇంకా తన దగ్గరే ఉంది. అలా ‘ఇష్క్’ మొదలైంది. ఈ సినిమా వల్ల పీసీ శ్రీరామ్ లాంటి గొప్ప టెక్నీషియన్‌తో పనిచేయగలిగాను. శ్రీరామ్ సాధారణంగా కథ నచ్చకపోతే చేయరు. సఖి, ఖుషి తర్వాత మంచి లవ్‌స్టోరీ చేయలేదని, ‘ఇష్క్’ ఆ లోటు తీర్చిందని ఆయనే మెచ్చుకున్నారు.
‘ఇష్క్’లో నాది టైలర్ మేడ్ లాంటి కేరక్టర్. అందుకే అంత సహజంగా చేయగలిగాను. అంతకుముందు వచ్చిన సినిమాల్లో నా యాక్షన్‌కి కొన్ని మైనస్లైనా చెప్పారు కానీ, ‘ఇష్క్’లో నా యాక్షన్‌కి హండ్రడ్ పర్సంట్ మార్కులు వేస్తున్నారు. నితిన్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అని విమర్శకులు కూడా చెబుతున్నారు. నాగార్జున, అల్లు అర్జున్, రామ్‌గోపాల్‌వర్మ, ఇలియానా, క్రిష్ లాంటి ప్రముఖులు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇందులో నేను బాగా గ్లామర్‌గా కూడా ఉన్నానని అందరూ ప్రశంసిస్తున్నారు. అంతకుముందు సిక్స్‌ప్యాక్ చేయడం వల్ల ఫేస్‌లో గ్లో తగ్గింది. అందుకే ఈ సారి అలాంటి ప్యాక్‌ల జోలికి వెళ్లలేదు.
నా కెరీర్లో ఎత్తులూ చూశాను, పల్లాలు చూశాను. నాకంటూ ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. ఇకపై కెరీర్లో తప్పు నిర్ణయాలు తీసుకోను. ఇక ఎక్కువ సినిమాలు చేస్తాను. అలాగని హడావిడిగా ఏదో ఒకటి చేసేయను. రాశి కన్నా వాసికే నా ప్రాధాన్యం. పక్కా మాస్ జోలికి పోకుండా నా వయసుకి తగ్గ పాత్రలే చేస్తాను. ప్రస్తుతం రెండు సినిమాలు ఒప్పుకున్నాను. నూతన దర్శకుడు విజయ్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ సంస్థలో ఒకటి, ఇంకో పెద్ద సంస్థలో మరొకటి చేయబోతున్నాను.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more