Karthikeya 2 to make its OTT debut on this date దసరా కానుకగా ఓటిటీలోకి నిఖిల్ ‘కార్తికేయ-2’

Nikhil siddhartha starrer film karthikeya 2 ott premiere deets how and when to watch

Karthikeya 2, Karthikeya 2 OTT, Karthikeya 2 ott premiere ZEE5, Karthikeya 2 Zee5, Karthikeya 2 watch online, Karthikeya 2 hd download, Karthikeya 2 ott release, Karthikeya 2 online, Nikhil Siddhartha, Nikhil Siddhartha Karthikeya 2, Karthikeya 2 movie, nikhil siddhartha movies, nikhil, mythological film, Anupama Parameshwaran, Anupam Kher, Chandoo Mondeti, Abhishek Agarwal Arts, OTT, ZEE5, Tollywood

The Nikhil Siddhartha-starrer mythological film Karthikeya 2 is all set to stream digitally on ZEE5. In the local Telugu region too it did phenomenal business and emerged as the highest-grossing movie of Nikhil's career. Karthikeya 2 is all set to stream online and viewers will be able to enjoy it from the comfort of their homes.

దసరా కానుకగా ఓటిటీలోకి నిఖిల్ ‘కార్తికేయ-2’

Posted: 09/27/2022 04:58 PM IST
Nikhil siddhartha starrer film karthikeya 2 ott premiere deets how and when to watch

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం​ కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక ఇతివృత్తంతో సాగిన సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలించింది. అంతేకాదు అటు అమెరికాలోనూ దాదాపు 30 రోజుల తరువాత కూడా 36 స్ర్కీన్లపై ఆడిన తొలి చిత్రంగా రికార్డులను సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. భారతీయ చిత్రసీమలో సునామీని సృష్టించి.. సినీవిశ్లేషకులు అంచనాలను తారుమారు చేసిన చిత్రం కార్తికేయ-2.

ఇటు టాలీవుడ్లో పవన్ కల్యాణ్ పరోక్ష ప్రచారంతో హిట్ సాధించిన చిత్రం.. ఆటు బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలను తెచ్చిపెట్టింది. పలు పెద్ద చిత్రాలతోనూ పోటీపడి యధేశ్చగా దాదాపుగా నలభై రోజుల పాటు బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతల పంటపడించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ ప్రోడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం మేరకు యాభై రోజులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. అయితే దసరా పండగ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను సాధించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 విడుదల చేయనుంది.. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles