RRV Trailer Talk: Commercially Packed Love Drama యువతలో క్రేజ్ పెంచుతున్న రంగరంగ వైభవంగా ట్రైలర్..

Ranga ranga vaibhavanga trailer it is a complete vaishnav tej and ketika sharma s youthful family drama

Ranga Ranga Vaibhavanga Movie Trailer, Vaisshnav Tej, Ketika Sharma, Devi Sri Prasad, Gireeshaaya, Ranga Ranga Vaibhavanga, RRV Trailer, Ranga Ranga Vaibhavanga Trailer, RRV On Sep 2nd, SVCC, Sri Venkateshwara Cine Chitra, #PVT3, BVSN Prasad, Bapineedu B, DSP, Rockstar DSP, Vaisshnav Tej Latest Movie, Vaisshnav Tej Latest Movie Trailer, Ranga Ranga Vaibhavanga Telugu Movie Trailer, Vaisshnav Tej Movies, Ketika Sharma Movies, Latest Telugu Movies, Tollywood, movies, Entertainment

Mega compound's young hero Panja Vaishnav Tej proved his mettle with his first movie Uppena itself… His awesome screen presence and romance with the lead actress made the movie turn into a blockbuster. Now, he is ready to hit the big screens with another youthful entertainer Ranga Ranga Vaibhavanga movie. Having Ketika Sharma as the lead actress and being a commercial plot, there are many expectations on it.

యువతలో క్రేజ్ పెంచుతున్న రంగరంగ వైభవంగా ట్రైలర్..

Posted: 08/23/2022 10:04 PM IST
Ranga ranga vaibhavanga trailer it is a complete vaishnav tej and ketika sharma s youthful family drama

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆద్యంతం యువతకు మంచి కిక్కిచ్చే సినిమాగా రూపోందించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా మారింది.

నాయికా నాయికల బాల్యానికి సంబంధించిన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేలా కట్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచుతోంది. అద్యంతం ఆకట్టుకునేలా ట్రైలర్ రూపోందించారంటే.. ఇక చిత్రం ఎలా తెరకెక్కించారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. చిన్నప్పటి నుంచి గొడవ పడే ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఎలా మారారు? చివరకు ఒక్కటయ్యారా, లేదా? అనే కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రంలోని సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది.

వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ హావాభావాలు, భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. "నాన్న ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా" అంటూ వైష్ణవ్ చెప్పే సంభాషణతో ట్రైలర్ ముగిసింది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. నవీన్ చంద్ర, నరేశ్, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles