After Nagababu, Prakash Raj Resigns From MAA Membership నాగబాబు తరువాత మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా

Maa elections 2021 after nagababu prakash raj resigns from maa membership

Prakash Raj ready to act with Manchu Vishnu, Prakash Raj loses, Prakash resigns from MAA membership, Prakash Raj loses in MAA Elections, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, prakash raj news, tollywood, movies, entertainment

South Indian senior actor Prakash Raj who contested for the presidential post in the recently held MAA Elections announced that he is going to submit his resignation for MAA membership. He gave a tough competition to Manchu Vishnu who won as the new president of the Movie Artists Association. He said that he will respect the mandate.

MAA Elections 2021: నాగబాబు బాటలో ప్రకాశ్ రాజ్.. మా సభ్యత్వానికి రాజీనామా

Posted: 10/11/2021 01:06 PM IST
Maa elections 2021 after nagababu prakash raj resigns from maa membership

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు ఎంపీ. ఎమ్మెల్యే ఎన్నికల తరహాలో ఎంతో ఉత్కంఠభరితంగా జరిగాయి. అంతేకాదు మా ఎన్నికల ఫలితాలు కూడా అంతే రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలలో అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులలో మంచు విష్ణు ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రకాశ్ రాజ్ పై ఏకంగా 107 ఓట్లతో గెలుపొందారు. దీంతో తన ఫ్యానల్ నుంచి కీలకమైన సభ్యులు గెలిచినప్పటికీ తాను మాత్రం భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలుకావడంపై ఆయన మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇవాళ ఆయన మీడియా ఎదుట హాజరై మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

మా అధ్యక్ష ఎన్నికలలో తాను అకస్మాత్తుగా రాలేదని, ఏడాదిగా గ్రౌండ్‌ వర్క్‌ చేసి వచ్చామని చెప్పిన ఆయనను తనకు ఓటు వేస్తామన్న వారే భారీగా క్రాస్ ఓటింగ్ వేశారని ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇక తన ప్యానల్ కు చెందిన సభ్యులు కొందరు ఈ ఎన్నికలలో విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారి విజయానికి దోహదపడిన ఓట్లు తన వరకు వచ్చేసరికి క్రాస్ అయ్యాయన్న అనుమానం ఆయన వర్గీయులు నుంచి వ్యక్తమైంది. అయితే మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల తీర్పును తాను గౌరవిస్తున్నట్లు చెప్పారు.

మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌ని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించింది. అలాంటి మా లో ప‌ని చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ప్ర‌కాశ్‌రాజ్ చెప్పారు. లోక‌ల్, నాన్ లోక‌ల్ అజెండా మ‌ధ్య ప‌ని చేయ‌లేను అని ప్ర‌కాశ్‌రాజ్ తేల్చిచెప్పారు. మా లో స‌భ్య‌త్వం లేక‌పోతే సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వ‌రా? అని ప్ర‌శ్నించారు. క‌ళాకారుడిగా నాకు ఆత్మగౌర‌వం ఉంద‌న్నారు. 21 ఏండ్లుగా మాతో అనుబంధం ఉంద‌న్నారు.

ప్రాంతీయ‌, జాతీయ‌వాదం నేప‌థ్యంలో ఈ ఎన్నిక జ‌రిగింది. తెలుగుబిడ్డ‌ను, తెలుగువాడిని మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. గెస్ట్ గా వ‌స్తే అతిధిగానే ఉండాల‌ని చాలా మంది చెప్పారు. ఇక నుంచి తాను అదే తీరున వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నానని చెప్పారు. ఈ నిర్ణ‌యం బాధ‌తో తీసుకున్న‌ది కాదని.. తాను తెలుగు వాడిని కాదని మాత్రమే తీసుకున్నదని అవేదనతో అన్నారు. అయితే తాను తెలుగువాడికి కాకపోవడానికి కారణం.. తన త‌ల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడమేనని.. అయితే అది తన త‌ప్పు కాదని.. అలాగని తన త‌ల్లిదండ్రుల త‌ప్పు కూడా కాదని ప్ర‌కాశ్ రాజ్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles