Vijay Deverakonda meets Balakrishna on Liger sets ‘లైగర్’ సెట్ లో అడుగుపెట్టి ఆశ్యర్చపర్చిన బాలయ్య

Nandamuri balakrishna pays surprise visit to vijay deverakonda on sets of liger

liger, liger movie, vijay deverakonda, vijay deverakonda liger, nandamuri balakrishna liger sets, vijay deverakonda movies, balakrishna vijay deverakonda liger, Vijay Deverakonda, Puri Jagannadh, Charmme Kaur, Nandamuri Balakrishna, Liger, Akhanda, Pragya Jaiswal, Ananya Panday, tollywood, Movies, Entertainment

Actor Vijay Deverakonda was pleasantly surprised when veteran Telugu star Nandamuri Balakrishna paid a visit on the sets of his upcoming film Liger in Goa. The actor took to Twitter and shared a picture of himself with Balakrishna, film director Puri Jagannadh and co-producer Charmme Kaur.

‘లైగర్’ సెట్ లో అడుగుపెట్టి ఆశ్యర్చపర్చిన బాలయ్య

Posted: 09/22/2021 05:53 PM IST
Nandamuri balakrishna pays surprise visit to vijay deverakonda on sets of liger

అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండకు గీతగోవిందం చిత్రం మరో శిఖరానికి చేర్చింది. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన చిత్రంతో ఆయన ఫ్యామిలీ అడియన్స్ కు పరిచయం అయ్యారు. అర్జున్ రెడ్డితో యువతలో క్రేజ్ ఏర్పర్చుకున్న విజయ్. గీతగోవిందంతో తన అభినయాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ విజయ్ కి రాకపోయిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

అంతేకాదు అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అది కాసింత వివాదాస్పదం కావడంతో అది కూడా చిత్ర ప్రమోషన్ కు దోహదపడింది. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కరోనా వలన నత్తనడకన సాగుతుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతన్న లైగర్ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.

గోవాలో చిత్రీకరణ జరుగుతుండగా, సడెన్ గా బాలకృష్ణ సెట్లో ప్రత్యక్షం అయ్యారు. పూరీ, ఛార్మీ,విజయ్ ఆయనతో కలిసి ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ విజిట్ చేసి టీం అందరిని ఆశీర్వదించారు అని టీం పేర్కొంది. లైగర్ చిత్రంలో  రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ మిక్స్‌డ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles