sonu sood to reprise the role of sp umesh chandra రెబల్ పోలీసు అధికారి బయోపిక్ లో సోనుసూద్

Sonu sood to star in police officer umesh chandra biopic

lock down, Real Hero, sonu sood, sp umesh chandra, Umesh Chanrdra IPS, umesh chandra biopic, tollywood, movies, Entertainment

Actor Sonu Sood, who made the headlines for his unmatched humanitarian deeds during the lockdown, is getting a bunch of films offers lately. After his craze went across the globe, filmmakers from Hindi and Telugu are evincing interest to rope him to their projects.

రెబల్ పోలీసు అధికారి బయోపిక్ లో సోనుసూద్

Posted: 02/08/2021 10:36 PM IST
Sonu sood to star in police officer umesh chandra biopic

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ చిత్రాలకు మంచి క్రేజ్ లభించింది. ఇక మన తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే మహానటి సావిత్రి చిత్రం ఎంత బంఫర్ హిట్ అయ్యిందే ప్రేక్షకులకు తెలియంది కాదు. దీంతో ఇప్పటికే పలువురు సినీ స్టార్స్, పొలిటిషియన్స్, స్పోర్ట్ పర్సనాలిటీస్‌ కి సంబంధించిన నిజ జీవిత కథలకు వెండితెర రూపమివ్వగా మంచి ఆదరణ దక్కింది. రియల్ స్టోరిస్ అంటూ తెరకెక్కిన పలు కథాంశలతో తెరకెక్కిన చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే అదరించారు.

సినిమాను ఆకట్టుకునేలా తీయాలే కానీ.. ఎలాంటి స్టోరీ అయినా హిట్ చేస్తాం అంటున్నారు మన తెలుగు ప్రేక్షకులు ఆ కోవలో మరో తెలుగు వ్యక్తి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఆధారంగా ఓ క్రేజీ బయోపిక్ తెరకెక్కబోతోంది. పోలీస్ శాఖలో రెబల్ అధికారిగా, అందరి చేత ‘కడప టైగర్‌’ అనిపించుకున్న ఎస్పీ చదలవాడ ఉమేష్ చంద్ర జీవితం సినిమాగా రానుంది. ఉమేష్ చంద్ర లైఫ్ స్టోరీ చాలామందికి స్ఫూర్తినిచ్చింది. వృత్తి పరంగా డేర్ అండ్ డాషింగ్ వ్యవహరించారయన.

ఎస్సార్ నగర్ కూడలి వద్ద మావోయిస్టుత చేతిలో హతమైన ఆయన జీవితాన్ని అధారంగా చేసుకుని మరో బయోపిక్ తెరకెక్కనుంది. మరో విశేషం ఏంటంటే.. లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయమందించి ‘రియల్ హీరో’, ‘హెల్పింగ్ హ్యాండ్’ అనిపించుకున్న సోనూ సూద్ ఈ బయోపిక్‌లో ఉమేష్ చంద్ర క్యారెక్టర్ చెయ్యబోతున్నారు. విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర వేసిన డేరింగ్ స్టెప్స్, పర్సనల్ లైఫ్, మరణం.. ఇలా అన్ని విషయాలూ బయోపిక్‌లో చూపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles