Raghava Lawrence Requests Help From Kerala CM రాఘవ లారెన్స్ ఔదార్యం.. పాత్రికేయుడికి సాయం..

Raghava lawrence requests help from kerala cm as he supports needy

raghava lawrence, Poor Journalist, CM Pinarayi vijayan, Tamil Journo mother, scribe mother mortal remains, kerala CM, Tamil Nadu, kollywood

Raghava Lawrence requested help from Kerala CM Pinarayi Vijayan on behalf of a journalist in Tamil Nadu. He wrote that the journalist’s mother passed away at a hospital in Kerala and requested his help to take the mortal remains to Tamil Nadu. He also promised to bear the hospitals expenses that came upto roughly Rs 1.50 lakh

రాఘవ లారెన్స్ ఔదార్యం.. పాత్రికేయుడికి సాయం..

Posted: 05/11/2020 08:46 PM IST
Raghava lawrence requests help from kerala cm as he supports needy

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వచ్చంధ కార్యక్రమాలకు ముందు వరుసలో నిలిబడతారని తెలుసు, ఇప్పటికే చిన్నారి హృద్రోగులకు అపరేషన్ చేయిస్తున్న ఆయన వాటితో పాటు పలు సామాజిక కార్యక్రమాలకు ముందుంటారు. తాజాగా ఆయన పేద పాత్రికేయుడికి కూడా ఆయన తల్లి మరణం విషయంలో సహకరించారు. తిరువనంతపురంలోని ఎన్ఐఎంఎస్‌ వైద్యశాలలో మృతి చెందిన తమిళనాడుకు చెందిన పాత్రికేయుడు అశోక్ తల్లిని ఆమె స్వస్థలానికి చేర్చేందుకు సహకరించాలని కోరుతూ లారెన్స్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు.

వైద్యశాలకు చెల్లించాల్సిన లక్షన్నర రూపాయలను చెల్లించే స్థితిలో ఆ పేద పాత్రికేయుడు లేడని, కాబట్టి సహకరించి కన్యాకుమారిలోని అతడి స్వస్థలానికి ఆమె భౌతిక కాయాన్ని పంపే ఏర్పాటు చేయాలని, ఆ సొమ్మును ఒకటి రెండు రోజుల్లో తానే చెల్లిస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన లారెన్స్.. తన తల్లితో వచ్చి ఇటీవల సీఎంను కలిసి కరోనా సహాయనిధిని అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సీఎంను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles