టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తనకు సుపరిచితురాలైన యువతిని పరిణయమాడారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న మహిళ తేజస్వినిని (వైఘా రెడ్డి) దిల్‌రాజు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినట్లు సమాచారం.
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు. తన రెండో పెళ్లి గురించి దిల్ రాజు నిన్న పరోక్షంగా అభిమానులకు సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. గత కొంతకాలం నుంచి తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని.. తన వ్యక్తిగత జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more