Be aware of supremacy people: Shalini Pandey ఆదిపత్యం చలాయించేవారు దగ్గరివారైనా దూరమే.!

Be aware of those people who show supremacy on others says shalini pandey

shalini pandey on supremacy people, shalini pandey distance. shalini pandey, supremacy people, bollywood, maintain distance, movies, entertainment, tollywood

Be aware of those people who show supremacy on others and says to maintain distance from those people Shalini Pandey

ఆదిపత్యం చలాయించేవారు దగ్గరివారైనా దూరమే.!

Posted: 04/14/2020 09:47 PM IST
Be aware of those people who show supremacy on others says shalini pandey

ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకోగలిగింది షాలినీ పాండే. అవడానికి ఉత్తరాది అమ్మాయే అయినా, దక్షిణాదినే మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయింది. ప్రారంభంలో ఆమె కెరీర్‌ నత్తనడక నడిచినా, ఆ తరువాత మాత్రం స్పీడ్ అందుకుంది. ఎంత స్పీడంటే.. బాలీవుడ్‌లో ఒక్క అవకాశమొస్తే చాలని దక్షిణాది హీరోయిన్లు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. షాలినీకి ఒకేసారి రెండు మూడు సినిమాల్లో అవకాశం వరించేంతగా ఆమె స్పీడుంది. అయితే షాలినీ పాండే మన జీవితం మీద ఆదిపత్యం చెలాయించాలని చూసేవారికి దూరంగా ఉండండి అని తెలుపుతుంది. ఆ వివరాలేంటో ఆమె మాటల్లోనే..

‘‘మన జీవితం మీద వేరొకరు ఆధిపత్యం చెలాయిస్తే భరించడం కష్టం. ఆధిపత్యం చెలాయించడం కూడా రెండు రకాలుగా ఉంటుంది. మనల్ని తక్కువ చేసి, తామే అధికులమనుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అలాంటి వారికి అస్సలు అవకాశమివ్వకూడదు. వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వారు మనకు ఎంత కావలసిన వారైనా సరే వారితో సంబంధం తెంచుకోవడమే ఉత్తమం. అలాంటి వారిని ఒక్కక్షణం కూడా భరించలేను. వెంటనే వారిని దూరం పెడతాను. లేదా నేనే దూరంగా వెళ్ళిపోతాను. మరో వర్గం ఉంటుంది. మన మీద విపరీతమైన ప్రేమాభిమానాలుంటాయి. వారిని భరించడం తేలికే. అలాంటివారికి దూరంగా ఉండను..’’ అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles