Actor Kushal Punjabi found dead in his Bandra residence వర్థమాన టీవీ నటుడి బలవన్మరణం

Ishq mein marjawan fame kushal punjabi dies at age 37 a look at his life journey

kushal punjabi no more, kushal punjabi died, Kushal Punjabi, ishq mein marjawan, kushal punjabi death, Shweta Tiwari, karanvir bohra, TV actor found dead, Entertainment, Movies, TV

Television actor Kushal Punjabi, who won the reality game show, Zor Ka Jhatka: Total Wipeout, has died at the young age of 37 on December 27, 2019. The reason behind his shocking demise is still unknown.

వర్థమాన టీవీ నటుడి కుషల్ పంజాబీ బలవన్మరణం

Posted: 12/27/2019 12:06 PM IST
Ishq mein marjawan fame kushal punjabi dies at age 37 a look at his life journey

వర్దమాన టీవీ నటుడు కుషల్ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాంద్రాలోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషల్ పంజాబీ ఆత్మహత్యకు పాల్పడినట్టు కనిపించినట్టు స్పాట్ బాయ్ వెల్లడించడంతో ఈ వార్త ఒక్కసారిగా గుప్పుమంది. కుషల్ పంజాబీ వయస్సు 37 సంవత్సరాలు. 'ఇష్క్ మై మర్జవాన్'లో న్యాయవాది డేనీ మాన్ చంద్ గా నటించిన ఆయన ఆ పాత్రలో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
 
కుషల్ పంజాబీ మృతిని ఆయన పట్ల ఆయన సన్నిహిత మిత్రుడు కరణ్ వీర్ బోహ్రా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. దీనిపై ఆయన భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 'మిత్రమా...నీవు మరణించావని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. నీవు లేవని అంటుంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. నువ్వు చాలా సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నావని నాకు తెలుసు. కానీ ఇది చాలా దురదృష్టకరం. ఇంత త్వరగా మమ్మల్ని విడిచివెళ్తావని అనుకోలేదు. నువ్వు గడిపిన జీవితం నాకు ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చింది. నీ డాన్స్, ఫిట్‌నెస్, ఆఫ్-రోడ్ బైకింగ్, నీ నవ్వు ముఖం, నీ ఆప్యాయత ఎన్నటికీ మరువలేం. ఎంతో విలువైన జీవితం విషాదాంతం కావడం ఎప్పటికీ మరచిపోలేను' అని ఆ ట్వీట్‌లో బోహ్రా ఆవేదన వ్యక్తం చేశారు.
 
టీవీ సిరియల్ అర్టిస్టుగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన లవ్ మ్యారేజ్, సిఐడీ, దేఖో మగర్ ఫ్యార్ సే, కబి హా కబి నా, యే దిల్ చాహే మోర్, కసమ్ సే, హుష్.. ఫిర్ కోయి హై, జిందగీ విన్స్, లాంటి పలు టీవీ సిరియల్స్ లో ఆయన నటించారు. కుషల్ 2015 నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు సంతానంలో కియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రెండ్రోజుల క్రితమే తన కుమారుడితో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో కుషల్ ఒక ఫొటో పోస్ట్ చేశాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kushal Punjabi  ishq mein marjawan  Shweta Tiwari  karanvir bohra  TV actor  Entertainment  

Other Articles