Nani's Gang Leader film seems super-fun నవ్వులు పూయిస్తున్న నాని గ్యాంగ్ లీడర్ ట్రైయిలర్

Gang leader trailer out nani s powerful act promises to be a thrilling yet fun ride

gang leader, nani, natural star, Vikram K Kumar, gang leader trailer, revengers assemble, Priyanka Arul Mohan, Priyadarshi, Nani, Lakshmi, Kartikeya, gang leader trailer, gang leader, tollywood, movies, entertainment

Nani’s Gang Leader in which Nani and Priyanka Arul Mohan are playing lead roles. Hero Karthikeya is playing the role of villain. The thriller flick is directed by Vikram Kumar and music composed by Anirudh Ravichander.

నవ్వులు పూయిస్తున్న నాని గ్యాంగ్ లీడర్ ట్రైయిలర్

Posted: 08/28/2019 09:46 PM IST
Gang leader trailer out nani s powerful act promises to be a thrilling yet fun ride

నాచురల్ స్టార్ నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో రూపోందించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించిన బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరిలు నిర్మించిన ఈ చిత్రం ట్రైయిలర్ ను ఇవాళ విడుదల చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్, రెండు లిరికల్ సాంగ్స్ కూడా అదరగొట్టడంతో, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక గ్యాంగ్ లీడర్ ట్రైయిలర్ తో ఇప్పటికే నాని చిత్రాలపై వున్న అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమాలో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత లభించడంతో ఫ్యామిలి అడియన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. రియాంక అరుళ్ మోహన్ తొలిసారి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు ఒక వెరైటీ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ సినిమాల డివిడిలు చూస్తూ నాని కథ రాయడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

ఫేమస్ రివేంజ్ రైటర్ కాబట్టి అయిదుగురు ఆడవాళ్లు తన దగ్గరకి రావడం, సినిమాలను కాపీ కొట్టి కథలు రాసే ఫ్రాడని తెలుసుకోవడం, 'మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే.. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం'.. అని నాని బిల్డప్ ఇవ్వడం.. ఇలా ఫన్నీగా స్టార్ట్ అయిన ట్రైలర్ యాక్షన్‌తో ఎండ్ అవుతుంది. నాని నేచురల్ పర్ఫార్మెన్స్, లక్ష్మీ, శరణ్య, ప్రియా అరుల్ మోహన్, కార్తికేయ తదితరుల నటన, ఆర్ఆర్, విజువల్స్ బాగున్నాయి. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్రాండ్‌గా రిలీజవుతుంది.

అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, ఫన్నీ, యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఓవర్ ఆల్ గా ఈ గ్యాంగ్ లీడర్ ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెంచేసిందనే చెప్పాలి. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, ప్రణ్య, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనిరుధ్, కెమెరా : మిరోస్లా కూబా బ్రోజెక్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : వెంకీ, డార్లింగ్ స్వామి, ఆర్ట్ : రామ్ కుమార్, సీఈఓ : చిరంజీవి (చెర్రీ).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles