Ravi Teja teams up with 'RX100' director! రవితేజ హీరోగా దర్శకుడు అజయ్ భూపతి చిత్రం

Ravi teja to team up with director ajay bhupathi

mass maharaj, ravi teja, ajay bhupathi, ajay bhupathi naga chaitanya, ajay bhupathi ravi teja, rx 100 director, rx 100 director ravi teja, movies, entertainment, tollywood

Tollywood star Ravi Teja is going to team up with Ajay Bhupathi, who is basking in the glory of his recent offering RX 100 starring Karthikeya and Payal Rajput.

రవితేజ హీరోగా దర్శకుడు అజయ్ భూపతి చిత్రం

Posted: 05/13/2019 08:47 PM IST
Ravi teja to team up with director ajay bhupathi

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా సినిమాను రూపోందించే పనిలో వున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాల జాబితాలో ఇటీవల వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' చేరిపోయింది. కుర్రకారు మనసులను ఈ సినిమా బాగా పట్టేసింది. దర్శకుడు అజయ్ భూపతికి ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి తదుపరి సినిమా పేరుగా 'మహాసముద్రం' వినిపించింది. చైతూ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి.

చైతూ మార్కెట్ కి మించి బడ్జెట్ వున్న కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదనేది తాజా సమాచారం. దాంతో తనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోన్న రవితేజ కోసం అజయ్ భూపతి మంచి మాస్ మసాలా కథని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. కొంత కాలంగా హిట్ అనే మాటకు దూరంగా వుండిపోయిన రవితేజ, అజయ్ భూపతి టాలెంట్ ను గుర్తించి అవకాశమిచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi teja  rx 100 director  ajay bhupathy  naga chaitanya  script  tollywood  

Other Articles

 • Bommarillu bhaskar akkineni akhil new movie launched

  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చిత్రం లాంచ్

  May 24 | అక్కినేని యువవారసుడిగా చిత్రరంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా.. అవి ఆశించినంతగా బాక్సాఫిసు వద్ద సందడి చేయకపోవడంతో.. తనకు ఒక చక్కని బ్రేక్ కావాలని వేచిచూస్తున్న హీరో అక్కినేని అఖిల్.... Read more

 • Alia bhatt is the times most desirable women of 2018

  టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అలియా భట్

  May 24 | వెండితెరపై కొంత కాలం సందడి చేసి తెరమరుగైన నటిమణులెందరో.. అభినయంతో పాటు అదృష్టం కూడా కలసివస్తేనే స్టార్ హీరోయిన్లుగా స్థిరపడతారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ తెరపై సందడి చేస్తూ.. దానిని కొనసాగిస్తున్న అందమైన భామలలో... Read more

 • Chinmayi sripada exposes man over twitter for asking for nudes

  అభిమాని అడిగాడని న్యూడ్ పిక్స్ పంపిన సింగర్

  May 22 | ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి... Read more

 • Narayana murthy loved cinema married and living with it chiranjeevi

  రూల్స్ పక్కనబెట్టి.. మూర్తన్న సంతోషపర్చిన చిరు.!

  May 22 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆహార్యంతో పాటు ఆహారం విషయంలో కూడా తనదైన పరిధులను పాటిస్తారన్న విషయం సినీ అభిమానులకు తెలియంది కాదు. అభిమానులను నిత్యం ఎంతో ఎనర్జిటిక్ గా అలరించే చిరంజీవి ఫిట్ నెస్... Read more

 • Teja opens up about sita re shoot says it will be a hit

  ‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

  May 21 | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి లేడి ఓరియంటెండ్ చిత్రంలో నటిస్తున్న సీత చిత్రంపై తనకు పూర్తి నమ్మకం వుందని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా... Read more

Today on Telugu Wishesh