తెలుగు చలనచిత్ర తెరపై ఇప్పుడు బయోపిక్ చిత్రాలకు ఆదరణ ఎక్కువైంది. ఒక సెలబ్రిటీ జీవితం గురించి పుస్తకాలు చదవడం.. వారి పరిచయస్థుల ద్వారా విషయాలను తెలుసుకోవడం.. లేక వారు రచించిన పుస్తకాల ద్వారా విషయాలను సంగ్రహించేంత సమయం లేదు ఈ తరం వారికి. అందుకనే సినిమాల ద్వరా రెండున్నర గంటల్లో వారి గురించి సాధ్యమైనంత తెలుసుకునేందుకు వేలం వెర్రిగా బయోపిక్ లను ఆదరిస్తున్నారు.
ఈ బయోపిక్ లలో ప్రముఖులతో పాటు క్రీడాకారులు, ఇతర రంగాలకు చెందిన వారి బయోపిక్ కూడా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ రౌడీ షీటర్ లారా బయెపిక్ కూడా తెరకెక్కింది. అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలను అతను రౌడీషీటర్ గా మారడానికి గల కారణాలను ఈ చిత్రంలో అసక్తికరంగా రూపోందించారు దర్శకుడు కార్తికేయ. నల్లాస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో హీరో తనీష్ లారా పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ‘రంగు’ అని టైటిక్ కూడా ఫిక్స్ చేశారు.
ఈనెల చివరివారంలో (నవంబర్ 23న) విడుదలకు నోచుకోనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణ. వారందిలో సునయనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. తనీష్ పక్కనే ఉంటూ అతని చేయిపట్టుకుని తెగ సందడి చేసింది. ఆమెతో పాటు నందిని, శ్యామల, సంజనా, గణేష్, అమిత్, రోల్ రైడా, సామ్రాట్ లు పాల్గొని ‘రంగు’ మూవీ ఆడియో లాంచ్ చేశారు. బిగ్ బాస్ ఇంట్లో తోటి సభ్యుడు తనీష్ కోసం వారు స్పెషల్ ఫెర్మార్మెన్స్ చేశారు. ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి మరో ఆణిముత్యం జాలువారిందని కితాబిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more