ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబును పట్టించు.. లక్ష రూపాయలను పట్టుకెళ్లు అన్న ఆపర్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చంద్రబాబును పట్టించడం ఏంటి... ఈ ఆఫర్ ఎవరి నుంచి వెలువడింది అనగానే దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి. అసలు వర్మ ఏమైనా మతుండే మాట్లాడుతున్నాడా.. చిన్నా, పెద్ద అంతరం తెలియకుండా ఇలాంటి ప్రచారం చేయడమేంటి అని నిలదీసే అభిమానులు కూడా లేకపోలేరు.
అవును నిజమే కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వర్మ కూడా పిచ్చోడు అయితే కాదు కదా.. అయితే ఆయనేం చేసినా తనకు ప్రచారం ఫ్రీగా కలసిరావాలనే అన్వేషించే వ్యక్తి అర్జీవి. ఇలా చంద్రబాబు విషయంలోనూ సంచలనం చేసేందుకు ఈ ప్రకటన ఇచ్చాడా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రచారం విషయం ఎలా వున్నా తన ప్రకటనతో అర్జీవి మరోసారి కావాలనే కావాల్సినంత అగ్గి రాజేసాడు.
సోషల్ మీడియాలో రెండు రోజులుగా డూప్ చంద్రబాబునాయుడు ఒకరు బాగా సర్కిలేట్ అవుతున్నాడు. హోటల్లో పనిచేసే ఆయన ఛట్నీ వస్తూ సైడ్ కోణంలో అచ్చం చంద్రబాబును దించేసాడు. ఈ ఫోటోతో పాటు వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈయన విజువల్ ను పట్టుకుని ఆయన్ని తన "లక్ష్మీస్ ఎన్టీఆర్" లో పెట్టుకుంటానని చెబుతున్నాడు వర్మ. ఇందుకోసం తనదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టిన అర్జీవి ఇలాంటి సంచలన ప్రకటన విడుదల చేశాడు.
అచ్చంగా చంద్రబాబులా కనిపిస్తున్న ఆయన డూప్ ను.. మొదట ఎవరు పట్టించినా వాళ్లకు లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. దానికోసం అడ్రస్ కూడా ఇచ్చాడు. ఎవరైతే ముందు ఈయన అడ్రస్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి పంపిస్తారో వాళ్లకు లక్ష రూపాయలిస్తానంటున్నాడు. ఆయన్నే తన "లక్ష్మీస్ ఎన్టీఆర్"లో చంద్రబాబు పాత్రకు తీసుకుంటానంటున్నాడు. అసలే ఈయన చేస్తున్న బయోపిక్ "ఎన్టీఆర్" జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ నుంచి మొదలవుతుంది. మరి అక్కడ చంద్రబాబు పాత్రే కీలకం కానుంది. మరి చంద్రబాబు డూప్ అడ్రస్ దొరుకుతుందో లేదే వేచిచూడాలి.
Anybody who can track him can give his contact details via email at This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ..The reward of 1 lak will be given to the first person who does that #NTRTRUESTORY pic.twitter.com/ShBakNJgEY
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more