Navadeep eyes on Allu Sirish's Audi car అల్లు శిరీష్ కారుపై నవదీప్ నజర్..

Allu sirish s touching gesture towards his fan wins hearts

allu sirish, navdeep, fans pleaded, laptop, allu sirish gifts laptop to his fan, allu sirish gesture towards fan, navdeep eyes on allu sirish audi car, audi car, tollywood, movies, entertainment

Tollywood Hero Allu Sirish is currently shooting for the Telugu remake of Malayalam super-hit film ‘ABCD’. Meanwhile, Sirish’s touching gesture towards his fans is winning hearts all over.

అల్లు శిరీష్ ముందు అభిమానుల కోరికల చిట్టా..

Posted: 10/01/2018 03:17 PM IST
Allu sirish s touching gesture towards his fan wins hearts

హీరోలు తమ అభిమానులకు గుప్త దానాలు ఎందుకు చేస్తారో.. తెలుసా.? తెలియదా.? ఎందుకంటే.. ఒకరికి సాయమందిస్తే.. తరువాత నాకు సాయం చేయారా ప్లీజ్ అనే వారి సంఖ్య చెంతాడంత వుంటుందన్న విషయం తెలిసిందే. అందుకనే హీరోలే కాదు నటులైనా.. ఎవరైనా సాయం చేయాలని.. తమ వినతిలో నిజం వుందని అనిపిస్తే మాత్రం గుప్తదానం చేసి.. ఎప్పుడో సాయం పొందిన అభిమాని విషయాన్ని బయటకు చెబితే తప్ప ఆ సాయం వివరాలు బయటకు రావు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుండే నేటి తరం యంగ్ హీరోల జాబితాలో వున్న అల్లు శిరీష్.. తన సోదరుడు తనకు ఇచ్చిన ల్యాప్ టాప్ ను పోస్టు చేయడం.. ఆ వెంటనే ఓ అభిమాని తనకు ల్యాప్ ట్యాప్ వృత్తి రిత్యా చాలా అవసరమని, అయితే ప్రస్తుతం తాను దానిని కొనే స్థొమత లేనివాడ్ని అని.. పెద్ద మనస్సుతో తనకు ల్యాప్ ట్యాప్ ను బహుమతిగా ఇవ్వాల్సిందిగా కొరాడు.

ఆ వెంటనే స్పందించిన అల్లు శిరీష్.. అయ్యే సోదరా.. నా ల్యాప్ ట్యాప్ ను పంపుతాను దానిని వాడుకో అంటూ చెప్పాడు. ఇకపైనా బాగా ఆర్జించి కుటుంబానికి అండగా నిలబడు అంటూ హితవు పలికాడు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే వెల్లడించడంతో.. అతని ఎదుట అభిమానుల కోరికల చిట్టా పెట్టేశారు ఫ్యాన్స్. ఒకరు తనకు కూడా ల్యాప్ టాప్ కావాలని కోరితే.. మరోకరు మరో కోరిక అల్ల శిరీష్ ముందు పెట్టారు.

వీరిందరి విషయాన్ని పక్కనబెడితే.. నటుడు నవదీప్ కూడా అసక్తికర ట్వీట్ పెట్టాడు. తనకో కారు కావాలని శిరీష్ ని అర్ధిస్తూ ఓ పోస్టు పెట్టాడు. "హాయ్ అల్లు శిరీష్ అన్నా... నేను కూడా నీ అభిమానినే. నాకు ఒక కారు గిఫ్ట్‌ గా ఇవ్వొచ్చుగా. నేను కొత్త కారు కొనుక్కోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. నాకు సినిమా వేతనం తక్కువ. కారు అవసరం చాలా ఎక్కువ. మీ ఆడి క్యూ 7 కొత్తదే అయినా మీ మనసు పెద్దదని నాకు తెలుసు" అని వ్యాఖ్యానించాడు. దీనిపై శిరీష్ ఇంకా స్పందించలేదుగానీ, ఫ్యాన్స్ తమకు ఏమేం కావాలో కోరికల చిట్టాను శిరీష్ ముందుంచుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu sirish  navdeep  fan  laptop  audi car  allu arjun  tollywood  

Other Articles