anjali hesitates for selfie with fans at tirumala తిరుమల కొండపై అభిమానులతో అంజలి సెల్ఫీ..

Young actress anjali hesitates for selfie with fans at tirumala

young actress anjali, anjali tirumala, fans anjali, anjali selfie, anjali selfie with fans, heroine anjali in tirumala,heroine anjali with her sister in tirumala,actress anjali visits tirumala,celebrities at tirumala,actress anjali visits tirumala, latest movie news, kollywood, tollywood, movies, entertainment

A Young actress Anjali is well known for her role in Seethamma Vakitlo Sirimallechettu, was in Tirumala, alongwith her relative. Several fans crowded around her to take a selfie, whom she obliged after minimum fuss regarding tirumala temple.

తిరుమల కొండపై అభిమానులతో అంజలి సెల్ఫీ..

Posted: 07/03/2018 03:37 PM IST
Young actress anjali hesitates for selfie with fans at tirumala

దక్షిణాది యువనటి అంజలి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకుంది. ఈ చిత్రంలో అమె నటనకు అమెకు ఏకంగా ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. గీతాంజలి చిత్రంలో కూడా అద్భుతనటకు మరో అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత ఇటు యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా అమె ఇటీవల తన బంధువుతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

ఉదయం పూట బ్రేక్ దర్శనంలో అమె దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. ఇంతలో అమె చూసిన పలువురు అభిమానులు అమెతో సెల్పీ దిగేందుకు అమెను వెంటే వచ్చారు. మేము మీ అభిమానులం మేడమ్ అనగానే అమె ధ్యాంకూ అంటూ సమాధానమిచ్చారు. ఇంతలో ఓ అభిమాని మేడం ఒక్క సెల్ఫీ అని అడిగాడు. ఇక్కడ సెల్పీ దిగితే.. కమర్షియల్ అవుతుంది (అంటే తిరుమల క్షేత్రంలో సెల్పీలు దిగితే ఆలయ పవిత్రకు భంగం కలిగించినట్లు అవుతుంది కాదా..) అని అన్నారు.

అయితే తననకు తాను మీడియా ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి ఏమీ పర్వాలేదు మేడం.. సెలబ్రిటీలు ఎందరెందరో వస్తారు.. అభిమానులతో సెల్పీలు దిగుతారు.. అని చెప్పగానే అమె తనకు ఇష్టం లేకున్నా.. అభిమానుల ఆసక్తిని కాదనలేక సెల్ఫీకి అంగీకరించారు. దీంతో వారు సెల్పీ తీసుకోగానే తమ బంధువుతో కలసి అంజలి తమకు కేటాయించిన గదికి చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  anjali  tirumala  selfie  fans  temple rituals  tollywood  kollywood  

Other Articles