First Look: Sudheer Babu's Nannu Dochukunduvate సుధీర్ బాబు ‘‘నన్ను దోచుకుందువటే’’ ఫస్ట్ లుక్ విడుదల

First look sudheer babu s nannu dochukunduvate

sudheer babu, nannu dochukunduvate, nabha natesh, Kannada actress, ajanesh, RS Naidu, samohanam, first look, sms, movies, entertainment, tollywood

Young actor Sudheer Babu, is now busy with his next, which titled as Nannu Dochukunduvate and it features Kannada actress Nabha Natesh as his love interest.

సుధీర్ బాబు ‘‘నన్ను దోచుకుందువటే’’ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 06/29/2018 04:37 PM IST
First look sudheer babu s nannu dochukunduvate

‘ఎస్ఎంఎస్’ సినిమాతో తెలుగు వెండితెరకు హీరోగా పరిచయమైన సుధీర్ బాబు.. సమ్మెహనం చిత్రంతో టాప్ గేరులో పయనిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో బ్రేక్ తీసుకున్న ఈ హీరో ఆ చిత్రం నుంచి ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత చాలా సినిమాలు చేసినా కలిసిరాలేదు. అయితే తాజాగా ‘సమ్మోహనం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. హీరోగా సక్సెస్‌ అయిన సుధీర్‌బాబు ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌ ను పెట్టి ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన తొలిసారి నిర్మాతగా మారుతుండగా, ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభ నతేశ్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సుధీర్ బాబు మళ్లీ క్లాసిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో ఒకేసారి హీరోహీరోయిన్లను చూపించేశారు.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ.. ‘నన్ను దోచుకుందువటే టైటిల్ ను ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పడు ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేసాం. చిత్ర నిర్మాణంలో ప్రొడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకూడదనే సంకల్పంతో సుధీర్ బాబు పనిచేస్తున్నారు. కథ చాలా కొత్తగా ఉంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే దాదాపు పూర్తి చేశాం. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రంలో నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudheer babu  nannu dochukunduvate  nabha natesh  ajanesh  first look  sms  tollywood  

Other Articles