Rangasthalam to beat his own magadheera record రంగస్థలం చిట్టిబాబు సవాల్.. మగధీర కాసుకో..

Rangasthalam to beat his own magadheera record

Chiranjeevi, Mega star, Mega powerstar, Ram Charan, Indian film actor ram charan, srimanthudu, khaidi no 150, magadheera, ss rajamouli, tollywood, entertainment

Mega power star Ram Charan Tej starer Rangasthalam is also expected to smash the record of Magadheera. It should be seen whether it would be able to beat the record of megastar Chiranjeevi's comeback film Khaidi No 150.

రంగస్థలం చిట్టిబాబు సవాల్.. మగధీర కాసుకో..

Posted: 04/09/2018 04:23 PM IST
Rangasthalam to beat his own magadheera record

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. కలెక్షన్ల విషయంలో పాత రికార్డులను కొల్లగొడుతూ కొత్త రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం.. ఇటు నైజామ్ సహా అటు మొత్తంగా కూడా 'మగధీర' రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మోగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రంగస్థలంలోని సౌండ్ ఇంజనీరు చిట్టిబాబు.. మగధీరకు సవాల్ విసురుతున్నాడని కూడా చలోక్తులు విసురుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో ఈ సినిమా 128 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన రంగస్థలం.. 10 రోజులు పూర్తయ్యేనాటికి 147.10 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇంతకుముందు 144.55 కోట్లను వసూలు చేసి రికార్డును సెట్ చేసిన 'శ్రీమంతుడు'ను అధిగమించింది. ఇక 150 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి పరుగులు తీస్తుంది. ఈ రికార్డును టచ్ చేసిన చిత్రాల్లో 'బాహుబలి'ని పక్కన పెడితే, 'మగధీర' 150 కోట్లను .. 'ఖైదీ నంబర్ 150' 164 కోట్లను వసూలు చేసి ముందువరుసలో నిలిచాయి. ఈ రెండు చిత్రాల రికార్డలను రంగస్థలం త్వరలోనే క్రాస్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇటు నైజామ్ విషయానికొస్తే..  గతంలో ఇక్కడ 'మగధీర' 22.64 కోట్లను వసూలు చేసింది. చరణ్ కెరియర్లో ఈ ఏరియాలో ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమా ఇదొక్కటే. ఇప్పుడు  ఈ ఏరియాలో 20 కోట్ల వరకూ కొల్లగొట్టి ఈ రికార్డుకి దగ్గరగా వచ్చేసిన 'రంగస్థలం' .. త్వరలో దానిని క్రాస్ చేసే అవకాశాలు చాలా వరకూ కనిపిస్తున్నాయి. నైజామ్ లో 'రంగస్థలం' మరో కొత్త రికార్డును సృష్టించడం ఖాయమని మెగా అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rangasthalam  magadheera  khaidi no 150  Tollywood  entertainment  

Other Articles