Priyamani Complaint at MAA Over Old Movie | ఆ సినిమా ఐదేళ్ల క్రితంది.. నాకు సంబంధం లేదు. ‘మా’ లో ప్రియమణి ఫిర్యాదు

Priyamani complaint at maa

Actress Priyamani, MAA (Movie Artistes Association), Angulika Movie, Complaint, Priyamani Complaint, Priyamani Angulika Movie

Actress Priyamani has reportedly filed a complaint with the MAA (Movie Artistes Association) against the makers of Angulika. She Claimed that Makers using her images to promote the teaser of the film. She had signed to play the lead role in Angulika five years ago. But the actress walked out of this project for some reason after shooting for some portion. However, the makers roped in another actress and completed its shooting. They released its teaser on YouTube on Sunday, March 11 and the video has credited Priyamani as the female lead.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ప్రియమణి ఫిర్యాదు

Posted: 03/14/2018 01:03 PM IST
Priyamani complaint at maa

నటి ప్రియమణి గత కొంత కాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పేరును వాడుకుంటూ ఓ చిత్రాన్ని తెలుగులో ప్రచారం చేస్తుండటంపై ఆమె మండిపడుతున్నారు. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

తెలుగులో ఐదేళ్ల క్రితం అంగుళిక అనే సినిమా కోసం ఆమె సంతకం చేశారు. అయితే కొంత పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక.. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆమె బయటకి వచ్చేశారు. తర్వాత మరో కథానాయికతో ఆ చిత్రం పూర్తి చేశారు.

కానీ, ఇప్పుడు ఆ చిత్రం కోసం ప్రియమణి ఫోటోలు, టీజర్ లో ఆమెను చూపిస్తున్నారు. దీంతో తనకు సంబంధం లేని చిత్రం కోసం తన పేరును ఎలా వాడుతారంటూ ఆమె దర్శకనిర్మాతలపై మాలో ఫిర్యాదు చేసింది. తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. 'మా' కార్యాలయానికి అందజేశానని ఆమె మేనేజర్ జి.హరినాథ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles