Salman Skip Marriage And Become A Father | పెళ్లేందుకు.. పిల్లల్ని కను!

Rani mukerji urges salman to have a baby

Rani Mukerji, Salman Khan, Bigg Boss 11, Hichki, Siddharth P Malhotra

Rani Mukerji Advises Salman Khan To 'Skip Marriage And Become A Father'. Rani Mukerji said that Salman Khan's children will be as good looking as the actor.

సల్మాన్ కు సూపర్ సలహా ఇచ్చిన రాణి ముఖర్జీ

Posted: 01/06/2018 05:58 PM IST
Rani mukerji urges salman to have a baby

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అతని స్నేహితురాలు. గతంలో వీరిద్దరూ కలిసి 'బాబుల్', 'హలో బ్రదర్', 'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'కహీ ప్యార్ నా హోజాయే', 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' చిత్రాల్లో నటించారు. ఆ చొరవతోనే ఆమె సల్లూ భాయ్ కి ఆసక్తికరమైన సలహా ఇచ్చింది.

పెళ్లి చేసుకోరాదని, ఇదే సమయంలో తండ్రి కావాలని చెప్పింది. తన కుమార్తె అదిరాకు సల్మాన్ బిడ్డ మంచి ఫ్రెండ్ అవుతుందని తెలిపింది. తన తాజా సినిమా 'హిచ్కి' ప్రమోషన్ కోసం సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్-11కు రాణి వచ్చింది. ఈ సందర్భంగా సల్లూకు ఈ సలహా ఇచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్ అధినేత ఆదిత్య చోప్రాను రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. సల్మాన్ బేబీ ఆయనలాగే అందంగా ఉంటుందని ఈ సందర్భంగా రాణి తెలిపింది. ఒకవేళ తనలా కాకుండా, తల్లిలా అందంగా లేకుండా పుడితే పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా సల్మాన్ ప్రశ్నించగా... అక్కడ నవ్వులు విరబూశాయి.

బాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. నటి సుష్మితాసేన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. తుషార్ కపూర్, కరణ్ జొహార్ లు ఐవీఎఫ్ మరియు సరోగసీ విధానం ద్వారా తండ్రులు అయ్యారు. ఇదే మాదిరే సల్మాన్ ను కూడా తండ్రి కావాలంటూ రాణి సలహా ఇచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles