Ferocious Anushka in Bhaagamathie Trailer | అనుష్క భాగమతి ట్రైలర్ విడుదల.. ఆరుంధతి-2?

Anushka bhaagamathie trailer

Anushka, Bhaagamathie Trailer, Unni Mukundan, Bhaagamathie Trailer Review

Anushka Bhaagamathie Trailer Released. Anushka and the male lead Unni Mukundan looked quite nice together and had sparkling chemistry. Neat editing, crisp shots and suitable background score is the highlight of the trailer. The cuts are made in such a way that much story isn’t revealed and at the same time a good deal of curiosity is built.

భాగమతి ట్రైలర్ విడుదల.. అనుష్క నట విశ్వరూపం

Posted: 01/08/2018 04:59 PM IST
Anushka bhaagamathie trailer

అనుష్క అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'భాగమతి' ట్రైలర్ వచ్చేసింది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన విషయం తెలిసిందే. ట్రైలర్ మొదట్లో .. జనానికి మంచి చేసే ఐఏఎస్ అధికారిణి చంచల పాత్రలో అనుష్క కనిపిస్తోంది. ఆపై హీరో ఉన్నిముకుందన్ లవ్ యాంగిల్ చూపించారు.

అయితే కొంతమంది దుర్మార్గులు ఓ పథకం ప్రకారం ఆమెను ఓ కేసులో ఇరికించటం. ఆపై ఓ పాడుబడిన బంగళాలో బంధించడం .. తనని అక్కడి నుంచి తీసుకెళ్లమని అనుష్క దీనంగా వేడుకోవడం ట్రైలర్ లో కనిపిస్తోంది. "ఎవరుపడితే వాడు రావడానికీ .. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా .. 'భాగమతి' అడ్డా .. లెక్క తేలాలి .. ఒక్కణ్ణీ పోనివ్వను" అంటూ 'భాగమతి' లుక్ తో అనుష్క చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా.. సినిమాపై అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

భారీతనానికి అద్దం పట్టేలా గ్రాఫిక్స్ తో బాగానే తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. మళయాళ నటుడు జయరామ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. నటన పరంగా అనుష్క విశ్వరూపం చూపుతోన్న ఈ సినిమాను, జనవరి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles