Sharwanand with Crazy Heroine and Director | ముగ్గురు క్రేజీనే.. మరి సినిమా?

Crazy combo movie in tollywood

Sai Pallavi, Sharwanand, Hanu Raghavapudi, Sri Lakshmi Venkateswara Cinemas

Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi film. Regular shoot starts from Jan 3rd week.

క్రేజీ హీరో-హీరోయిన్-డైరెక్టర్

Posted: 12/28/2017 04:57 PM IST
Crazy combo movie in tollywood

వరుస చిత్రాలతో హిట్లు కొడుతూ (ఈ ఏడాది రాధా తప్ప) మంచి ఫామ్ లోనే ఉన్నాడు. శర్వా మరో ప్రత్యేకత ఏంటంటే.. స్టార్ హీరో సినిమాల మధ్యలో విడుదలైనప్పటికీ అవి బ్లాక్ బస్టర్లు కావటం. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో మొన్నే ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు కూడా.

ఫిదా' సినిమాతో యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను సాయిపల్లవి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాతో ఆమె తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. దీంతో ఆమె శర్వానంద్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ విషయాన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు మేకర్లు. ప్రసాద్ - సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు.

కథ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నందువల్లనే వాళ్లు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుందంట. వచ్చేనెల 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles