Tough fight between Thaman and Keeravani for Sye Raa | థమన్ కు కాల్ రాలేదు.. సైరాకు ఆయనే మ్యూజికా?

Tough fight for sye raa music director

SS Thaman, Sye Raa Movie, Megastar Chiranjeevi, Thaman Keeravani, Sye Raa Chiranjeevi, Sye Raa Music Director

SS Thaman says, he is yet to hear from 'Sye Raa' makers. Megastar Chiranjeevi's much awaited biopic, 'Sye Raa', due to his hectic schedule. Following, Rahman's statement, the tinsel town was rife with speculations that noted Tollywood composer SS Thaman has been roped in to replace the Academy Award winning musician. But, when asked about him setting music for the prestigious project, Thaman clarified that he hasn't received any call from 'Sye Raa' makers. He added that he will let everyone updated about the developments.

సైరా... థమన్ వర్సెస్ కీరవాణి

Posted: 12/09/2017 05:57 PM IST
Tough fight for sye raa music director

సైరా సినిమా కోసం భారీ తారాగణం ఎంపిక జరిగింది .. అలాగే ప్రముఖ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను రూపొందించి .. అదే స్థాయిలో విడుదల చేయనున్నారు. అందువలన ప్రతి విషయంలోను ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహ్మాన్ ను అనుకున్నారు.

కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టును తాను చేయలేకపోతున్నట్టుగా ఆయన ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో తమన్ కే ఆ బాధ్యతను అప్పగిస్తారనే టాక్ వచ్చింది .. ఆయన కూడా ఈ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే తమన్ కి ఛాన్స్ దక్కకపోవచ్చనేది తాజా సమాచారం. బోయపాటి-చెర్రీ సినిమాకు థమన్ కన్ఫర్మ్ అయ్యాడు. దీంతో 'సైరా' కోసం ఇతర సంగీత దర్శకుల ఎంపికపైనే దృష్టి పెట్టాడట.

ఈ క్రమంలో కీరవాణి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. 'బాహుబలి' వంటి భారీ సినిమాలకి పనిచేసి మెప్పించిన కీరవాణిని తీసుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles