Will Prabhu Deva Capable to Handle Dabangg Series | సల్మాన్ నమ్మకం ఆయన నిలబెడతాడా?

Dabangg 3 director confirmed

Prabhu Deva, Dabangg 3, Salman Khan, Dabangg 3 Director, Dabangg 3 Movie, Dabangg 3 Prabhu Deva

Prabhudeva to direct Salman Khan-Sonakshi Sinha's Dabangg 3. Offcially Confirmed by Arbaaz Khan.The shooting of the movie will start in April 2018.

దబాంగ్-3.. ప్రభుదేవానే దర్శకుడు

Posted: 11/18/2017 11:33 AM IST
Dabangg 3 director confirmed

కెరీర్ మొదట్లో దర్శకుడిగా సక్సెస్ లు చవిచూసిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.. గత కొన్నేళ్లుగా మాత్రం దారుణమైన డిజాస్టర్లను చవిచూస్తున్నాడు. రౌడీ రాథోడ్ తర్వాత వరుసగా ఆర్.. రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్.. ఇలా దారుణమైన ఫ్లాపులను అందించాడు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా దబాంగ్ సిరీస్ బాధ్యతలను చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

దంబాగ్ సిరీస్ లో వచ్చిన గత రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. పైగా అందులో కథ.. కథనం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చిత్రీకరించాడు. కానీ, ప్రభుదేవా రీమేక్ లను తప్ప.. కొత్త కథలను హ్యాండిల్ చేయలేడన్న విమర్శలు ఒకానోక టైంలో వినిపించాయి.అంతేకాదు సల్మాన్ లాంటి బిగ్ హీరోను డీల్ చెయ్యటం కత్తి మీద సాములాంటిది. ఈ తరుణంలో ప్రభుదేవా ఎలాంటి కథతో రాబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే సల్మాన్ మాత్రమే కాదు.. నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా ప్రభుదేవా టాలెంట్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పైగా వీరిద్దరి కాంబోలో వాంటెడ్(పోకిరీ రీమేక్) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ లెక్కన దబాంగ్ మూడో పార్ట్ ను ఈ సీనియర్ డాన్స్ మాస్టర్ చేతిలో పెట్టడమే రైట్ ఛాయిస్ అని వారిద్దరూ అంటున్నారు. వచ్చే  ఏడాది ఏప్రిల్ లో దబాంగ్-3 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అర్బాజ్ ఖాన్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dabangg 3  Prabhu Deva  దబాంగ్-3  ప్రభు దేవా  

Other Articles