2.0 Epic Disaster Event New Plan | 2.ఓ.. దుబాయ్ ఫ్లాన్ ఫెయిల్.. మళ్లీ ఇప్పుడెందుకు?

2 0 audio launch event telecast

2.0 Audio, 2.0 Dubai Event, Zee Tamil 2.0 Audio, 2.0 Audio Failure, Rajinikanth, Director Shankar, Zee Tamil Channel

Zee Tamil channel is going to telecast the epic audio launch event of Shankar and Rajnikanth’s ‘2.0‘ which happened at Burj Park, in Dubai. The entire planning is nothing a disaster planning Now Tele cast in Small Screen.

2.ఓ ఆడియో టెలికాస్టింగ్.. సెటైర్లు

Posted: 11/18/2017 11:00 AM IST
2 0 audio launch event telecast

ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న 2 పాయింట్ ఓ చిత్రం రిలీజ్ వాయిదాపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేక్షకుల్లోనే కాదు.. రజనీ అభిమానుల్లో కూడా అసహనం పెరిగి పోతోంది. విజువల్ వర్క్స్ మూలంగానే ఈ పరిస్థితి చోటు చేసుకుందన్నది తెలిసిన విషయమే. అయితే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఓపిక పట్టాలని లైకా సంస్థ పరోక్షంగా మీడియా ద్వారా సంకేతాలు పంపింది.

ఇదిలా ఉంటే ఈ చిత్ర ఆడియో వేడుక దుబాయ్ బుర్జ్ పార్క్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 12 కోట్లు వెచ్చించి ఈ చిత్ర చాలా గ్రాండ్ గా వేడుకను నిర్వహించారు. ఇప్పుడు ఆ ఆడియో వేడుకను బుల్లితెరలో ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ మేరకు జీ ఛానెల్ వారు భారీ మొత్తం చెల్లించి టెలికాస్టింగ్ హక్కులను చెల్లించినట్లు గతంలోనే చెప్పుకున్నాం.

అయితే ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగిన ఈవెంట్ గురించి ఇప్పుడు ప్రేక్షకులు అంతే ఎగ్జయిటింగ్ గా చూస్తారా? అన్నది ఇప్పుడు అనుమానమే. పైగా చిత్ర లైవ్ స్ట్రీమింగ్ సమయంలోనే సోషల్ మీడియాలో అంతగా ఆదరణ దక్కలేదు. దీనికి తోడు యూట్యూబ్ లో కొందరు అప్ లోడ్ చేసిన ఫోటోలు, స్పీచులు ఇది వరకే చాలా మంది చూసి ఉన్నారు కూడా. అలాంటప్పుడు ఈ ప్రసారం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రేపు అంటే ఆదివారం జీ తమిళ్ ఛానెల్ లో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles