Kathi Mahesh Slams Hyper Aadi for Body Shaming Comments | ఆది పంచ్ లతో కత్తి మహేష్ కు ప్రాబ్లమేంటి?

Kathi mahesh fire on jabardasth comedian

Kathi Mahesh, Hyper Aadi, Jabardasth Comedy Show, Kathi Mahesh Jabardasth, Kathi Mahesh Facebook Live, Kathi Mahesh Pawan Kalyan Fans

Tollywood Critic Kathi Mahesh Fire on Jabardasth Comedian. In Previous Episode Hyper Aadi Satires on Mahesh. For Body Shaming Comments Kathi Mahesh serious on Aadi in Facebook Live.

హైపర్ ఆదిపై కత్తి మహేష్ ఫైర్

Posted: 11/13/2017 10:54 AM IST
Kathi mahesh fire on jabardasth comedian

జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది వేసిన ఓ స్కిట్ కత్తి మహేశ్‌కు కోపం తెప్పించింది. పెళ్లనేది సినిమాలు తీయటమంత కష్టం. అదే ప్రేమంటే ముందు పొట్ట, వెనుక బట్ట వేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ అంటూ గత ఎపిసోడ్ లో ఆది పేల్చిన పంచ్‌పై కత్తి మహేశ్ మండి పడ్డాడు. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆదిపై, జబర్దస్త్ షో‌పై కత్తి మహేశ్ విమర్శలు గుప్పించాడు.

సెటైర్లను కామెడీగా తీసుకుంటాను, ఎవరైనా తన మీద జోక్ వేస్తున్నారంటే ఎంతో కొంత సాధించినట్టేనని భావిస్తున్నా, దీని గురించి ఫీల్ కావడం లేదన్ని తెలిపాడు. చక్కటి సెన్స్ ఉన్న హైపర్ ఆదిని అభినందిస్తూనే.. బాడీ షేమ్ కామెంట్లు చేసిన అతడి తీరును తప్పుబట్టాడు. జబర్దస్త్ షో నేను చూడను, కానీ ఫ్రెండ్స్‌ను పంపే లింక్స్ చూస్తే నాకు ఈ విషయాలు తెలిశాయని చెప్పాడు. మనందరి దిగజారుడు తనానికి నిదర్శనం అని షో సాగుతున్న తీరునే విమర్శించాడు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, ఇలా పొట్ట బట్ట ఉంటే వేరైపోతామా అని మండిపడ్డాడు. ఆడవాళ్లను కించపరిచేలా ఉన్న ఆ షో అంటేనే తనకు నచ్చదని .. దయచేసి ఆ షోను చూడొద్దంటూ ప్రజలకు విజ్నప్తి చేశాడు.

ఎదుటి వ్యక్తిని కించపరిచేలా జోక్‌లు వేయడం ఏంటని కత్తి మహేశ్ ప్రశ్నించాడు. గతంలోనూ హైపర్ ఆది చేసిన స్కిట్‌లు కత్తి మహేశ్‌పై పంచ్‌లు వేసేలా ఉన్నాయి. బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తర్వాత మహేశ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేయడంతో.. పవన్ ఫ్యాన్స్ అతడిని తీవ్రంగా విమర్శించారు. తనను బెదిరిస్తూ.. భారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని గతంలో కత్తి మహేశ్ వాపోయాడు. ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా కత్తి మహేశ్ బదులిస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండటమే అతడికి మంచిదని సలహా ఇచ్చాడు. నేను ఇలా ఉండేందుకే ఇష్టపడతా. నా పొట్ట, నా బట్ట నాకు నిజంగా గర్వకారణం అని చెప్పాడు. పవన్‌ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అంటే.. అతడి వ్యక్తిగత విషయాలు, అపియరన్స్ గురించి మాట్లాడానా? కాస్త బుద్ది తెచ్చుకొని మాట్లాడండి అంటూ ఘాటుగా విమర్శించాడు.

చివరగా.. నీ షోను నువ్వు ఎంజాయ్ చేయ్. కానీ బాడీ షేమింగ్ గురించి తగ్గిస్తే మంచిది, నా బాడీ గురించి నేను హ్యాపీగా ఉన్నానని హైపర్ ఆదికి సలహా ఇచ్చాడు. సమకాలీక అంశాలపై తన స్కిట్ జోకులు వేసే ఆది గతంలో కూడా ఒకటి.. రెండు సార్లు కత్తి మహేష్ పై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nani producing movie surprises

  నాని నిర్మాతగా సర్ ప్రైజ్ లే...

  Nov 18 | నేచురల్ స్టార్ నాని ఏడాదికి మూడు చిత్రాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్.. నిన్ను కోరి... చిత్రాలు హిట్ ఖాతాలో పడిపోగా... ఎంసీఏ చిత్రం డిసెంబర్ లో రిలీజ్... Read more

 • Dabangg 3 director confirmed

  దబాంగ్-3.. ప్రభుదేవానే దర్శకుడు

  Nov 18 | కెరీర్ మొదట్లో దర్శకుడిగా సక్సెస్ లు చవిచూసిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.. గత కొన్నేళ్లుగా మాత్రం దారుణమైన డిజాస్టర్లను చవిచూస్తున్నాడు. రౌడీ రాథోడ్ తర్వాత వరుసగా ఆర్.. రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్.. ఇలా దారుణమైన... Read more

 • 2 0 audio launch event telecast

  2.ఓ ఆడియో టెలికాస్టింగ్.. సెటైర్లు

  Nov 18 | ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న 2 పాయింట్ ఓ చిత్రం రిలీజ్ వాయిదాపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేక్షకుల్లోనే కాదు.. రజనీ అభిమానుల్లో కూడా అసహనం పెరిగి పోతోంది. విజువల్ వర్క్స్... Read more

 • Racial treatment for kollywood music director

  కోలీవుడ్ సంగీత దర్శకుడిపై జాతి వివక్షత?

  Nov 18 | కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, కబాలి ఫేమ్ సంతోష్ నారాయణన్ జాతి వివక్షతను ఎదుర్కున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. సిడ్నీ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో అనుమానిత రసాయనాలు... Read more

 • Prakash raj reacted on padmavati issue

  పద్మావతి చిత్ర వివాదంపై ప్రకాశ్ రాజ్ ఆవేదన

  Nov 18 | దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌మే అంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌ప్పుబ‌ట్టారు. కళాకారులపై దాడులకు... Read more

Today on Telugu Wishesh