Syeraa Regular Shoot Confirmed from December First Week | సైరా మొదటి షాట్ ఏ సన్నివేశమో తెలుసా?

Sye raa movie regular shoot updates

Sye Raa Narasimha Reddy, Sye Raa Regular Shoot, DOP Ratnavelu, Rajeevan, Sye Raa Chiranjeevi, Sye Raa Narasimha Reddy Ratnavelu, Anushka Sye Raa

Syeraa Regular Kick Starts from December first week. Massive sets have been erected under the supervision of art director Rajeevan in aluminium factory, Hyderabad. 150 junior artists from UK have been finalized and they will participate in the shoot during the crucial freedom fighting episodes.

సైరా రెగ్యులర్ షూటింగ్ ఆ తేదీ నుంచే...

Posted: 11/13/2017 11:36 AM IST
Sye raa movie regular shoot updates

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం రెగ్యులర్ షూటింగ్ పై ఓ స్పష్టత వచ్చేసింది. ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు డిసెంబర్ 6వ తేదీ నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే లుక్కు పరంగా రెడీ అవుతున్న చిరంజీవి.. ఫిజికల్ కసరత్తులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.

మరోవైపు 150 మంది బ్రిటీష్ చిత్రయూనిట్ సభ్యులతో ఓపెనింగ్ సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతుందంట. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజీవన్ వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ మొదలుకాబోతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలలో చిరుతోపాటు ఇంకా ఎవరు పాల్గొనబోతున్నారన్నది తేలాల్సి ఉంది.

ఇక చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా దాదాపు ఖరారైనట్లే. ప్రస్తుతం రంగస్థలం సినిమాకు పని చేస్తున్న ఆయన నవంబర్ చివరి వారం కల్లా ఫ్రీ అయిపోతాడు. దీంతో ఆయన సైరా టీంకు డేట్లు సర్దుబాటు చేశారంట. నయనతార, ప్రగ్న్యా జైస్వాల్ లు హీరోయిన్లుగా ఖరారుకాగా.. ఓ కీలక పాత్ర కోసం అనుష్కను సంప్రదిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కొణిదెల ప్రోడక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న సైరాలో అమితాబ్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles