Nag RGV Praises Each Other in Social Media | నాగ్ మెసేజ్ లకు వర్మ రిప్లై.. ఎక్కువగా మాట్లాడుతున్నాడంట

Nag says don t underestimate rgv

Ram Gopal Varma, Nagarjuna Akkineni, Nag RGV, Nagarjuna Praise Varma, Varma Nagarjuna, Nag reminds Shiva Days

Ram Goapl Varma Action Cop Thriller with Nagarjuna. Nag Praises RGV and says Don't Underestimate him. Varma says Nag said Well.

వర్మను తక్కువ అంచనా వెయ్యొద్దంటున్న నాగ్

Posted: 11/03/2017 05:33 PM IST
Nag says don t underestimate rgv

సుమారు పాతికేళ్ల తర్వాత శివ మ్యాజిక్ రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త చిత్రం గురించి నాగ్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. తన కంటే ముందే మీడియా విషయం చెప్పిసిందంటూ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత చేసిన మరో ట్వీట్ కూడా వర్మకు బాగా నచ్చింది.

అప్పట్లో తాను వర్మకు శివ చిత్రం కోస ఓకే చెప్పినప్పుడు కూడా చాలా మంది కామెంట్లు చేశారని.. ఇప్పుడు కూడా కొత్త చిత్ర విషయంలో నిరూపించుకునే అవకాశం వచ్చిందని ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఆ సందేశం స్క్రీన్ షాట్ తీసిన వర్మ... ‘బాగా చెప్పావు నాగ్. మొట్టమొదటిసారిగా, నా కెరీర్ లో నేను చెబుతున్నా.. ఈ సినిమా గురించి ఒక్కముక్క కూడా నేను మాట్లాడను..నా సినిమానే మాట్లాడుతుంది’ అని పేర్కొన్నారు.

మరో సందేశంలో ‘హే నాగ్, నువ్వు ఎప్పుడూ తక్కువ మాట్లాడతావు, నేను ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం, మన పాత్రలు తారుమారయ్యాయి..’ అని వర్మ అన్నారు. కాగా, ఈ చిత్రం శివ తరహా చిత్రం కాదని.. ఓ స్టైలిష్ యాక్షన్ పోలీస్ కథ అని నాగ్ చెప్పేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles