Mobiles Not Allowed to Prabhas's Saaho Movie Shooting | సాహో షూటింగ్ కోసం జక్కన్న ఐడియా కాపీ

Restrictions in saaho shooting spot

Saaho Movie, Prabhas, Saaho Shooting Progess, Shradda Kapoor, Director Sujith, Prabhas Saaho, Saaho Shooting, Saaho Baahubali, Rajamouli Prabhas

No Mobile Phones to Saaho Movie Shooting Spot. Director Sujeeth Follows similar thought while Rajamouli did Baahubali shooting time.

సాహో షూటింగ్ లో ఫోన్లు బ్యాన్

Posted: 11/03/2017 06:15 PM IST
Restrictions in saaho shooting spot

ప్రభాస్ తాజా చిత్రం సాహో ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం లోని ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం మిడిల్ ఈస్ట్ కంట్రీలో చిత్రీకరణ చేస్తున్నారు. సుమారు 20 నిమిషాలపాటు ఇది ఉంటుందని సమాచారం.

ఆ ఒక్క సీన్ కోసం సుమారు పాతిక కోట్లు ఖర్చు చేస్తున్నారంట. అది కూడా నిర్మాణుష్య ప్రాంతంలో కావటం విశేషం. అందుకు కారణం లేకపోలేదు. ఈ మధ్య ఎలాంటి చిత్రానికైనా సరే లీకుల సమస్యలు చాలా ఎక్కువగా మారిపోయాయి. అసలే బాహుబలి హీరో చిత్రం కావటంతో ఈ చిత్రానికి లీకులు తప్పవనే భావించిన టీమ్ ఓ పని చేసింది. గతంలో బాహుబలి సమయంలో సెల్ ఫోన్ లకు ఎలాంటి అనుమతి లేకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తద్వారా వేల మంది షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు జక్కన్న.

దీంతో సాహో టీం కూడా ఇప్పుడు షూటింగ్ లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న చిన్న టెక్నీషియన్ల దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలియజేసింది. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Movie  ప్రభాస్  సాహో చిత్రం  

Other Articles