Young Heroines says No to Balayya's 102 Movie | బాలయ్య పక్కన ఛాన్స్.. అయినా ‘నో’ ఎందుకు చెప్పారు

Young heroines says no to balayya

Regina Cassandra, Pragya Jaiswal, Balakrishna Nandamuri, 102 Movie, Director KS Ravi Kumar, Regina Pragya Balayya, Young Heroines Fear Balayya

Tollywood Two Young Actresses says No to Balakrishna's 102 Movie. Regina and Pragya Jaiswal Rejected Balayya's Movie.

బాలయ్య చిత్రానికి నో చెప్పిన బ్యూటీస్

Posted: 10/10/2017 04:15 PM IST
Young heroines says no to balayya

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారి చిత్రాల్లో నటించేందుకు ఏ హీరోయిన్ అయినా ఊవ్విళ్లూరుతుంటారు. అలాంటిది సక్సెస్ రేటు అస్సలు లేని హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుంది. హిట్ కోసం ఖచ్ఛితంగా వాళ్లు సినిమాలకు ఒఫ్పుకుని తీరుతారనుకుంటాం. కానీ, యంగ్ బ్యూటీస్ రెజీనా, ప్రగ్య్నా జైస్వాల్ లు మాత్రం అలా కాదు.

ప్రస్తుతం బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఈ సినిమా కోసం 'రెడ్డిగారు' .. 'జయసింహా' టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు రాగా, ఇప్పుడు కర్ణ అంటూ మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నయనతార కీలకమైన పాత్ర పోషించగా... మరో రోల్ కోసం నటాషా(కూతురి రోల్ అని చెప్పుకున్నాం) ఓ పాత్ర పోషిస్తుండగా.. మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందన్నది తెలిసిందే.

అదిగో పాత్ర కోసం ముందు రెజీనాను సంప్రదించారట. అయితే ఆ పాత్ర చేయడానికి ఆమె ఆసక్తిని చూపలేదని అంటున్నారు. దాంతో అదే పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను కూడా అడిగారట. ఆమె కూడా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. పాత్ర నిడివి తక్కువగా ఉండటం .. అంతగా ప్రాధాన్యత కనిపించకపోవడం వల్లనే వాళ్లు ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అసలే వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న వీరు బాలయ్య లాంటి సీనియర్ హీరోతో చేస్తే సినిమా హిట్ అయినా తర్వాత ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశ్యంతోనే తిరస్కరించినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles