Hero Rajasekhar Mother Passes Away | హీరో రాజశేఖర్ తల్లి కన్నుమూత

Hero rajashekar mother passes away

Hero Rajasekhar, Rajasekhar Mother, Hero Rajasekhar Mother Expire, Hero Rajasekhar Passes Away, Andal Varadarajan Demise

Tollywood Senior Hero Rajasekhar' Mother Andal Varadarajan Passes Away.

రాజశేఖర్ తల్లి కన్నుమూత

Posted: 09/27/2017 03:29 PM IST
Hero rajashekar mother passes away

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి ఆండాళ్ వరదరాజ్ (82) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

దీంతో హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సాయంత్రం 5 గంటల వరకు దేహాన్ని అపోలో ఆసుపత్రిలో ఉంచి ఆపై చైన్నైకి తరలించారు.

తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో శేఖర్, ఆండాళ్ పిళ్ళై దంపతులకు రాజశేఖర్ రెండో సంతానంగా జన్మించాడు. వైద్యుడైన రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన నిర్మించి, నటించిన గరుడవేగ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles