ఈ దసరా పండగకు ప్రేక్షకులను అలరించేందుకు ఇద్దరు అగ్ర హీరోలతోపాటు ఓ క్రేజీ యంగ్ హీరో చిత్రాలు సిద్ధమైపోయాయి. పోటీ వాతావరణం వల్ల కలెక్షన్లు దెబ్బతినటం, అతిగా పెట్టి కొనుగోళ్లు చేసే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవటం లాంటి ఘటనలు చూశాం. అయినప్పటికీ చిత్రం బావుంటే పది చిత్రాలు వచ్చినా సక్సెస్ అయిన దాఖలాలు ఉంటాయని చెబుతూ పోటీకి సై అంటున్నారు.
ముఖ్యంగా జై లవ కుశ, స్పైడర్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే ఆ చిత్ర మేకర్లు ప్రమోషన్ లు నిర్వహిస్తున్నారు. రెండు సపరేట్ జోనర్లతో తెరకెక్కిన ఈ చిత్రాలకు వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా ఎన్టీఆర్ జై లవ కుశ.. తొలిసారి త్రిపాత్రిభినయం చేస్తున్న చిత్రం. వరుసగా హిట్లతో ఊపు మీద ఉన్న తారక్.. మొదటిసారి కాస్త నెగటివ్ షేడ్ ఉన్నపాత్రలో నటించటం .. పైగా ఆ జై పాత్ర టీజర్ కు ఆడియన్స్ ముగ్ధులైపోవటం చూశాం. ఈ నేపథ్యంలో సినిమాను హైలెట్ చేసేందుకు ఎన్టీఆర్ తన వంతు ప్రయత్నాలు కూడా ప్రమోషన్లలో బాగానే చేశాడు. వరుసగా ఫ్లాఫులతో నష్టాలు చవిచూసిన నిర్మాత కళ్యాణ్ రామ్ కు సోదరుడు ఎలాంటి హిట్ ఇస్తాడోనని ప్రేక్షకుల్లో.. అంతకు మించి అభిమానుల్లో ఓ ఆత్రుత నెలకొంది.
ఇక స్పైడర్ విషయానికొస్తే.. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తీశారు. పైగా తమిళ డెబ్యూ కూడా. బైలింగువల్ గూఢాచారి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టీజర్ వెలువడే దాకా ఎటువంటి అంచనాలు లేవు. ఎప్పుడైతే ప్రోమోస్ రీలీజ్ చేశారు అప్పటి నుంచే స్పైడర్ హవా మొదలైంది. పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ.. మురగదాస్ లాంటి స్టార్ దర్శకుడు కావటంతో చిత్రంపై అంచానాలు పెరిగాయి. విజువల్ ఎఫెక్ట్స్..అందుకు తగ్గట్లే సంతోష్ శివన్ కెమెరా వర్క్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీటికి తోడు సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా రావటంతో... బ్రహ్మోత్సవం వేసిన భారీ దెబ్బ నుంచి కోలుకుంటామనే భావనే అభిమానుల్లో నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more