Balakrishna And Mahesh babu Not Multistarrer But... | మహేష్-బాలయ్య... స్టోరీ అదేనా?

Balayya mahesh multi starrer story

Balakrishna, Mahesh Babu, Multistarrer Movie, Director Boyapati, Mahesh Babu Balayya, Mahesh Balayya Same Story, Tollywood Multistarrer, Mahesh Babu Multistarrer Movie, Balakrishna Mahesh Babu

Balakrishna And Mahesh babu Not Multistarrer Under Boyapati Director. But, Legend Director Tell same story to Both Heroes who first ready to do with that subject.

బాలయ్య-మహేష్ మల్టీస్టారర్.. అసలు స్టోరీ

Posted: 09/20/2017 10:49 AM IST
Balayya mahesh multi starrer story

ఓ దర్శకుడు బోలెడు కథలు సిద్ధం చేసుకుంటాడు. ఆ నేపథ్యంలో చాలా మంది హీరోలను కలిసి కథలను వినిపిస్తాడు. అలాంటి క్రమంలోనే టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోల మల్టీ స్టారర్ కహానీ పుట్టింది. మహేష్-బాలయ్యతో బోయపాటి ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో అసలు విషయం ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

నిజానికి బాలయ్య 100వ చిత్రం బోయపాటి చేతికి అందినట్లే అంది మిస్సయ్యింది. దీంతో వచ్చే ఏడాదిలో బాలయ్యతో ఖచ్ఛితంగా ఓ సినిమా తీస్తానని అనౌన్స్ చేశాడు. అదే సమయంలో స్టార్ హీరో మహేష్ బాబుతో కూడా ఎప్పటి నుంచో ఓ సినిమా కోసం బోయపాటి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ ను కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించాడంట. అంతకు ముందే బాలయ్యతో ఓ స్టోరీ గురించి డిస్కస్ చేశాడు.

అంటే ఈ ఇద్దరి హీరోల్లో ముందుగా ఎవరి డేట్స్ దొరికితే వాళ్లతో బోయపాటి సినిమా చేయవచ్చు. కానీ ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు హీరోలకి బోయపాటి ఒకే కథను వినిపించాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ కథనే ఎవరు ఓకే చేస్తే వారితో తీద్దామన్న ఆలోచనతో ఉన్నాడని వినికిడి. ఆ లెక్కన మల్టీస్టారర్ వార్తలు ఉత్తవేనని అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles