స్పైడర్-దూకుడు కు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా? | After Dookudu Relaity Show Concept in SPYder.

Spyder movie using bigg boss concept

SPYder Movie, Dookudu Concept, Mahesh Babu, AR Murugadoss, SPYder link with Dookudu, SPYder Bigg Boss Show Concept

Director Murugadoss Using Reality Show Concept for Mahesh Babu's SPYder Movie. Mahesh Using Bigg Boss Show Concept to Capture a Criminal in this Movie.

స్పైడర్ కోసమే బిగ్ బాస్ రియాల్టీ షో

Posted: 09/11/2017 03:42 PM IST
Spyder movie using bigg boss concept

సినిమాల ప్రమోషన్ కోసం ఈ మధ్య తారాలు రియాల్టీ షోలను ఆశ్రయించటం చూస్తున్నదే. ఇంతకాలం ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలను వాడేసుకున్న స్టార్లు.. టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉండే బుల్లితెరను ఏ మాత్రం మొహమాటం లేకుండా వాడేసుకుంటున్నారు.

భయపెట్టిన స్పైడర్

అయితే అగ్రహీరోలు అందుకు మినహాయింపు? అన్న డౌట్లను ఫటాఫంచల్ చేస్తున్నాడంటూ మహేష్ బాబు గురించి ఓ వార్త ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది. కొంతకాలం క్రితం మహేష్ బాబు స్పైడర్ చిత్రం కోసం బిగ్ బాస్ హౌజ్ కు వెళ్తున్నాడంటూ ఓ వార్త వినిపించింది. అయితే అది స్పైడర్ సినిమాలో ఓ పార్ట్ అన్న విషయం ఇప్పుడు లీక్ అయ్యింది.

సినిమాలో ఓ క్రిమినల్ ను పట్టుకునేందుకు హీరో రియాల్టీ షో కాన్సెప్ట్ ను క్రియేట్ చేస్తాడంట. అందులో భాగంగానే ప్రస్తుతం క్రేజ్ ఉన్న బిగ్ బాస్ ను వాడుకోబోతున్నారని సమాచారం. అంటే దూకుడులో ఎలాగైతే రియాల్టీ షో కాన్సెప్ట్ ను ఉపయోగించారో అలాగన్న మాట. అయితే అక్కడ కామెడీగా సాగిన ట్రాక్ ను.. ఇక్కడ చాలా సీరియస్ గా అదే సమయంలో ఎంటర్ టైనింగ్ గా మురగదాస్ తెరకెక్కించాడంట. ఆ లెక్కన్న మహేష్ బిగ్ బాస్ కు వెళ్లటం కాదు.. బిగ్ బాస్ నే మహేష్ కోసం రీ క్రియేట్ చేయబోతున్నారన్న మాట.

మహేష్ కోసం బాహుబలి టెక్నిషియన్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles