దేవుళ్లపై ట్వీట్ వేస్తే. ఎలా వార్నింగ్ ఇచ్చారో చూడండి | kajol warned in Twitter for Religious Tweet

Kajol tweet create controversy

Kajol, Kajol Religious Tweet, Kajol Twitter Controversy, Kajol Ganesh Visarjan and Bakrid Tweet, kajol Bakrid Tweet

Bollywood Actress Kajol warned in Twitter for Religious Tweet. but, she not respond for that.

కాజోల్ మత ట్వీట్ పై తీవ్ర దుమారం

Posted: 09/02/2017 05:10 PM IST
Kajol tweet create controversy

బాలీవుడ్ సీనియర్ నటి, అజయ్ దేవగన్ వైఫ్ కాజోల్ పై ఓ అభిమాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అభిమానుల‌కు గ‌ణేశ్ ఉత్స‌వ్‌, బ‌క్రీద్ పండుగ‌ల శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ న‌టి కాజోల్ ఓ ట్వీట్ చేయగా, అది వివాదాస్పదమైంది. రెండు పండుగ‌ల‌ను క‌లిపి ఒకేసారి విషెస్ చెబుతూ ఆమె ఓ వాక్యం రాశారు.

`గ‌ణ‌ప‌తి, ఈద్ పండుగ‌ల‌ను దేవుళ్లే కలసి ఒక‌రోజు జ‌రుపుకుంటున్నారు. మ‌రి మ‌న‌మెందుకు జ‌రుపుకోకూడ‌దు? అందరికీ శుభాకాంక్ష‌లు` అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనిపై ఓ ముస్లిం వ్యక్తి తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. `ఇదే మీకు నా చివ‌రి హెచ్చ‌రిక‌, లేదంటే జ‌ర‌గ‌బోయే వివాదానికి మీరే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంది` అని కామెంట్ చేశాడు.

కాజోల్‌కు మ‌ద్ద‌తునిస్తూ కొంత‌మంది నెటిజ‌న్లు ఆ ముస్లిం నెటిజ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ఇంకా కాజోల్ చేసిన ట్వీట్ చాలా బాగుంద‌ని, ఆలోచింప‌జేసేదిగా ఉంద‌ని చాలామంది నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Kajol  Controversial Tweet  

Other Articles