పవర్ స్టార్ కు కత్తి మహేష్ స్పెషల్ విషెస్ | Mahesh Kathi Special Birthday Wishes To Pawan Kalyan

Pawan special wishes by mahesh

Mahesh Kathi, Pawan Kalyan, Mahesh Kathi Pawan Kalyan, Mahesh Special Wishes Pawan kalyan, Mahesh Pawan Wishes

Tollywood critic Mahesh Kathi Special Birthday Wishes To Pawan Kalyan. He Fight with only PK fans Mahesh Added.

పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కత్తి మహేష్

Posted: 09/02/2017 04:28 PM IST
Pawan special wishes by mahesh

టాలీవుడ్ అగ్రన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌పై సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. త‌న‌ను టార్చ‌ర్ చేస్తున్నార‌ని, వెంటనే ప‌వ‌న్ కళ్యాణ్ త‌న‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా ఇటీవ‌ల డిమాండ్ చేశాడు. కాగా, ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా మహేశ్ కత్తి ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి, త‌న‌కు మ‌ధ్య పోరాటం జ‌రుగుతోంద‌ని, ఫ్యాన్స్ త‌మ తీరుని మార్చుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచ‌న చేశాడు.

ఈ సంద‌ర్భంగా నిన్న ఇచ్చిన ఇంట‌ర్వ్యూకి సంబంధించిన వీడియోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘మ‌రీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శత్రుత్వం నాకు ఎందుకుంటుంది!’ అని మహేశ్ కత్తి పేర్కొన్నాడు. కాగా, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వెంటనే కత్తి మహేష్ పవన్ రాజకీయ ఎంట్రీపై కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Mahesh Kathi  Birthday Wishes  

Other Articles