Another Non Baahubali Record for PK 25

Pawan new movie satellite price

PK 25, Pawan 25th Movie, Pawan Movie Satellite Rights, PK 25 Satellite Rights, Pawan New Movie Satellite Rights, PK Another Non Baahubali Record, Pawan Movie Gemeni TV

Pawan Kalyan New Movie Record Satellite Price. Satellite Rights sold to Gemini TV for 19.5 Crores till Non Baahubali Record.

పవన్-త్రివిక్రమ్ మూవీ.. మరో సంచలన రికార్డు

Posted: 07/10/2017 01:20 PM IST
Pawan new movie satellite price

కాస్త లేట్ గా ఫ్యాన్స్ ముందుకు వచ్చినా మంచి కంటెంట్ తో రావాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారు. గత ప్రాజెక్టులు అంచనాలను అందుకోవటంలో ఘోరంగా విఫలం కావటంతో త్రివిక్రమ్ సినిమా కోసం కాస్త కష్టపడుతున్నాడు. కెరీర్ లో ఎన్నడూ చేయని వైవిధ్యమైన రోల్ తోనే అభిమానులను అలరించబోతున్నాడంట.

ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ఫారిన్ లోకేషన్లో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరుపుకోబోతుంది. ఇక కాంబో, ఇందులో వెంకీ గెస్ట్ రోల్ లాంటి స్పెషల్ ఎట్రాక్షన్ లతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్లు చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో మరో సెన్సేషన్ న్యూస్ పవన్ 25వ చిత్రం గురించి బయటకు పొక్కింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఓ ప్రముఖ ఛానెల్ రికార్డు స్థాయికి కొనుగోలు చేసినట్లు సమాచారం. జెమినీ టీవీ 19.5 కోట్లకు (బాహుబలిని మినహాయిస్తే ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్) డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు. మిగతా భాషల్లో కూడా భారీ రేటుకే హక్కులను అమ్మే యత్నంలో నిర్మాతలు బిజీగా ఉన్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుష్బూ ఓ కీ రోల్ చేస్తుండగా, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా, ఆది పినిశెట్టి ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyam  Trivikram  25th Movie  Satellite Rights  

Other Articles