Krishna Vamshi Wrong Cuts fear Distributors

Distributors not interested for nakshatram rights

Krishna Vamshi, Krishna Vamshi Wrong Cuts, Krishna Vamshi Nakshatram Trailer, Nakshatram Movie Trailer, Krishna Vamshi Fade Out, Buyers Fear, Nakshatram Pre Release Business, Nakshatram Result, Nakshatram Trailer Review

Krishna Vamshi's Nakshatram Trailer Scare Distributors. Once-interested buyers have now allegedly backed off. Makers have yet to announce the film’s release date as the theatrical rights are yet to be sold.

నక్షత్రం ట్రైలర్.. వాళ్లు వణికిపోతున్నారు

Posted: 07/10/2017 01:33 PM IST
Distributors not interested for nakshatram rights

ఒక సినిమాపై అంచనాలు పెరిగిపోవాలంటే పద్ధతి ప్రకారం ఓ ఖచ్ఛితమైన స్ట్రాటజీని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి పరిస్థితులకు ఆ మాత్రం హడావుడి లేకపోతే మాత్రం జనాలు సినిమా గురించి పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి ట్రైలర్ దాకా ఇంట్రెస్టింగ్ అండ్ ఫర్ ఫెక్ట్ కట్ లు చేస్తేనే ఆసక్తి క్రియేట్ అయి ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఎక్స్ పీరియన్స్ డైరక్టర్ అయి ఉండి కూడా కృష్ణవంశీ ఆ విషయంలో పొరపాటు చేశాడనే ఇప్పుడంటున్నారు.

కొత్త చిత్రం నక్షత్రం ట్రైలర్ విషయంలో వంశీ రాంగ్ స్టెప్ వేశాడన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు కారణం లేకపోలేదు. ఆ మధ్య మేకింగ్ వీడియోలు, క్యారెక్టర్ల లుక్కుల పేరుతో హడావుడి చేసిన క్రియేటివ్ డైరక్టర్, ఈసారి ఏదో స్పెషల్ ట్రీటే ఇవ్వబోతున్నాడని బయ్యర్లు నమ్మారు. అందుకే భారీ రేటుకే సినిమాను కొనేందుకు ముందుకు వచ్చారు. డీల్ ఇంకా క్లోజ్ కానీ టైంలో ఆడియో పంక్షన్ సందర్భం రిలీజ్ చేసిన ట్రైలర్ మొత్తం వాళ్లలో కొత్త భయం పుట్టించింది.

కథ, కాన్సెప్ట్ ను పూర్తిగా రివీల్ చేయటంతోపాటు, టేకింగ్ విషయంలో పెద్ద ఎగ్జయిటింగ్ కలిగించే అంశాలేవీ లేకపోవటం దారుణంగా నిరాశపరిచింది. ఒక్క రొమాంటిక్ సాంగ్ లు తప్పా ఎక్కడా మ్యాటర్ లేదన్న విషయం స్పష్టమైపోయింది. దీంతో ఎవరైతే సినిమాను కొనేందుకు ముందుకు వచ్చారో.. వాళ్లే ఇప్పుడు వెనకంజ వేస్తుండటంతో రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. వాళ్ల భయం పొగొట్టాలంటే వంశీ మరో ట్రైలర్ ను కాస్త శ్రద్ధ పెట్టి రిలీజ్ చేస్తే మంచిదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nakshatram Trailer  Krishna Vamshi  Buyers Fear  

Other Articles