Chiru Not reason for Uday Kiran's Death

Uday kiran sister on his death

Uday Kiran, Uday Kiran Death, Uday Kiran Sister, Uday Kiran Sister Sridevi, Uday Kiran Chiranjeevi Bond, Chiru Encourage Uday Kiran, Uday Kiran Reason for Engagement Cancel, Uday Kiran Death reason, Personal Problems Uday Death, Uday Kiran Wife Torture Him

Uday Kiran's Sister Sridevi Exclusive Interview. Chiranjeevi not reason for Uday's Death infact Megastar encourages him after break engagement with his daughter Susmita.

ఉదయ్ కిరణ్ మరణం వెనుక చిరు.. అక్క ఏమంటోందంటే...

Posted: 07/08/2017 02:43 PM IST
Uday kiran sister on his death

ఎప్పటికీ మరచిపోలేని టాలీవుడ్ విషాదాల్లో నటుడు ఉదయ్ కిరణ్ మరణం ఒకటి. కమల్ తర్వాత చిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్న నటుడిగా ఓ రికార్డు అతని ఖాతాలో ఉంది. కానీ, కెరీర్ లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఎదురు కావటంతో పోరాడే శక్తి లేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అయితే పెరెంట్స్ కన్నా ఆయన ఎక్కువ మస్కట్ లో ఉండే సోదరి శ్రీదేవితోనే స్ట్రాంగ్ రిలేషన్ కొనసాగించేవాడంట. సోదరుడు చనిపోయిన తర్వాత మూడేళ్లకు ఆమె ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

అందులో ముఖ్యమైంది చిరు ఇన్ వాల్వ్ మెంట్ గురించి. నిజానికి ఉదయ్ కిరణ్ కెరీర్ స్పాయిల్ కావడానికి చిరంజీవే కారణమని కొంతమంది ఇప్పటికీ నిందిస్తుంటారు. కానీ, అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకెదిగిన నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. అందుకే ఆయనకు ఉదయ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ‘సుస్మితతో ఎంగేజ్ మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు . లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన తర్వాత తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి ఆయనే ముందుకు వచ్చాడు. కానీ ఎందుకో సుస్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడు అని తెలిపింది.

మేము ఒకసారి చిరంజీవి గారి ఇంటికి వెళ్లాం. వారి ఆతిథ్యం అద్భుతమనే చెప్పాలి. అలాంటి వ్యక్తి తన తమ్ముడి కెరీర్ ను నాశనం చేశాడన్న ఆరోపణలు సరికాదని తెలిపింది. తర్వాత విషితతో ఉదయ్ వివాహం జరిగింది. కానీ, ఎందుకో వాళ్లిద్దరూ సంతోషంగా ఉండలేకపోయారు. ఎప్పుడైనా ఫోన్ చేసినా మా తమ్ముడే(ఉదయ్) మాట్లాడేవాడు తప్ప, ఇంట్లో ఉన్నావిషిత ఏనాడూ మాట్లాడలేదు, చివరకు చనిపోయిన టైంలో కూడా. ప్రతీ విషయన్ని చివరకు డబ్బు సమస్య గురించి కూడా చెప్పుకునే వాడు, ఏనాడూ తన భార్యతో గ్యాప్ గురించి మాత్రం చెప్పుకోలేకపోయాడు అంటూ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Suicide  Uday Kiran  Chiranjeevi  

Other Articles