South Star Hero Denies Entering Politics

Shivarajkumar on political entry

Kannada Star Hero Politics, Shivarajkumar, Shivarajkumar Political Entry, Shivarajkumar Politics, Shivarajkumar Kalyan Jewellers Opening, Star Hero Denies Political Rumour, Shivarajkumar, Shiva Rajkumar Not Congress

Kannada Star Hero Shivarajkumar rules out joining politics. Kannada Kanteerava's Elder Son said it is just rumors. Shivarajkumar clarify meet with rahul and says not join in Congress.

కాంగ్రెస్ లోకి కన్నడ స్టార్? ఫ్యాన్స్ కి సారీ చెప్పేశాడు

Posted: 07/08/2017 01:48 PM IST
Shivarajkumar on political entry

స్టార్ హీరోలపై వచ్చే రూమర్లు వైరల్ అవ్వటం కామనే. ఒకవేళ అవి రాజకీయాలకు సంబంధించింది అయితే వాటిపై ఆటోమేటిక్ గా ఆసక్తి నెలకొంటుంది. తమిళనాడులో రజనీకాంత్ రాజకీయాల ఎంట్రీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న టైంలో మరో స్టార్ హీరో ఎంట్రీ గురించి వార్తలు బయలుదేరాయి.

లెజెండరీ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అగ్ర తనయుడు, నటుడు శివరాజ్ కుమార్ సినిమాల్లోకి వస్తాడంటూ కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. రాజకీయ నేతలతో టచ్ లో ఉండే ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ దీనిపై సంబరాలు కూడా చేసుకున్నాడు. రాహుల్ గాంధీతో భేటీ అయ్యే సరికి కాంగ్రెస్ లో చేరబోతున్నాడా? అని చర్చించుకుంటున్న సమయంలోనే పెద్ద షాకిచ్చాడు. తనకు అసలు అలాంటి ఉద్దేశమే లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని తెలిపాడు. కళ్యాణ్ జ్యూవెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్ అయిన శివరాజ్ కుమార్, హసన్ నగరంలో కొత్త బ్రాంచ్ ప్రారంభంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను సినిమాల్లో నటిస్తూ ఆనందంగా ఉన్నానని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశాడు. తన తల్లి చనిపోయాక పరామర్శించేందుకే రాహుల్ గాంధీ తమ ఇంటికి వచ్చాడని, దాని వెనుక రాజకీయ కారణాలు లేవని తేల్చేశాడు. గతంలో శివ భార్య గీత కూడా కాంగ్రెస్ లో చేరుతుందనే వార్తలు వచ్చినా, చివరకు జేడీఎస్ లో చేరిపోయి ఎన్నికల్లో పోటీ చేయబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada  Shivaraj Kumar  Political Entry  

Other Articles