Casting Couch Only Bad Women Go to Bed

Kerala actor comments on casting couch

Kerala, Mollywood Casting Couch, Actor on Casting Couch, Kerala Actor on Casting Couch, Kerala Actor cum MP Innocent, Actor Innocent, Innocent Controversial Comments, South Actor Casting Couch, Senior Actor Innocent, Innocent Controversial Comments

Kerala Actor, MP Innocent quotes that casting couch in Mollywood doesn’t exist anymore and only ‘bad women’ go to bed.

కాస్టింగ్ కౌచ్: సీనియర్ నటుడి కామెంట్స్ కలకలం

Posted: 07/06/2017 10:43 AM IST
Kerala actor comments on casting couch

కాస్టింగ్ కౌచ్ .. ఈ పేరుతో ఏ న్యూస్ వచ్చినా సరే హాట్ టాపిక్కే అవుతుంది. సీనియర్ల దగ్గరి నుంచి ఇప్పుడున్న స్టార్ అండ్ చిన్నాచితకా హీరోయిన్ల దాకా ఎవరో ఒకరు ఇండస్ట్రీలో రాణించాలంటే అడ్జస్ట్ అవ్వాలనో లేక తమకు ఎదురైన అనుభవాల గురించో చెప్పి కలకలమే రేపుతున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచే దీని మీద ఎక్కువ మంది కామెంట్లు చేయటం గమనార్హం.

ఇదిలా ఉంటే తమ ఇండస్ట్రీ చాలా క్లీన్ అంటూనే మళయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటుడు, ఎంపీ అయిన ఇన్నోసెంట్ ప్రస్తుతం అమ్మ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఓ మీడియా సమావేశంలో 72 ఏళ్ల ఈ సీనియర్ నటుడు మాట్లాడుతూ... కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం మాలీవుడ్ లో లేనే లేదని పేర్కొన్నాడు. గతంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన ఆయన, హీరోయిన్ల పట్ల చాలా మర్యాదగా ఇక్కడి హీరోలు వ్యవహరిస్తారని తెలిపాడు.

అయితే ఆ తర్వాతే ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు వివాదాన్ని రాజేశాయి. ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుందని చెబుతూనే తప్పు ఆడాళ్ల దగ్గరే ఉందన్న కోణంలో వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఆ మహిళలు చెడ్డవారైతే వారు తప్పకుండా పక్కలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా మహిళా లోకం భగ్గుమంది. దీనిపై ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడెక్కింది. గతంలో పార్వతి, లక్ష్మీరాయ్‌ వంటి వాళ్లు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడారని, అలాంటప్పుడు ఓ నటుడిగానే కాదు, ఓ ప్రజా ప్రతినిధిగా కూడా ఇన్నోసెంట్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Mollywood  Actor Innocent  Casting Couch  

Other Articles