Senior Actress Sensational Comments on MAA President

Actress tulasi fire on shivaji raja in twitter

Actress Tulasi, Tulsai Twitter, Senior Actress Tulasi, Tulasi Sankarabharanam Awards, MAA President Shivaji Raja, Shivaji Raja Controversies, Actor Shivaji Raja Sankarabharanam Awards, Shivaji Raja Tulasi Comments

Tollywood Senior Actress Tulasi fir on Shivaji Raja. Shivaji misusing his powers as Maa President and that was not permitted.

అవార్డుల గోల: నటుడు శివాజీరాజాపై షాకింగ్ కామెంట్లు

Posted: 07/06/2017 09:18 AM IST
Actress tulasi fire on shivaji raja in twitter

తెరపై నటనతో అలరించినా, బయట పైకి నవ్వుతూ కనిపించే మన స్టార్లు, ఆఫ్ మోడ్ లో మాత్రం మరో కోణాన్ని చూపించిన సందర్భాలు అనేకం. అంతర్ఘత విబేధాలతో పరోక్ష వ్యాఖ్యలు చేయటం, దానికి కౌంటర్ లు ఇలా వివాదాలు పీక్స్ లోకి వెళ్లిన ఉదంతాలు అనేకం పెద్ద పెద్ద పంక్షన్ లలో స్టేజీల పైనే చూశాం. అలాంటిదే మరో ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్ నటి తులసి మొన్నామధ్య శంకరాభరణం పేరిట అవార్డులను ప్రకటించి, బహుకరించిన విషయం తెలిసిందే. తొలి దఫా అవార్డుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ ధనుష్, నటి అలియా భట్‌ల పేర్లు ఉన్నాయి. వీరిలో ఎన్టీఆర్, ధనుష్ లు తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతారని అంతా భావించారు. అయితే వాళ్లెవ్వరూ రాలేదు. దీంతో తులసి ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది.

ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజానే దీనంతటికి కారణమని ఆమె ఆరోపిస్తోంది. శివాజీరాజా తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని.. ఆ సీట్ లో కూర్చున్న బఫూన్ అని.. అదేమీ పర్మినెంట్ సీట్ కాదని తెలుసుకోవాలంటూ ట్విట్టర్ లో తిట్టిపోసింది. అంతేకాదు పలు ఛానెల్స్ ను ట్యాగ్ చేస్తూ ఈ మెసేజ్ లు పెడుతుండడం విశేషం. అయితే ఆమె పేరుతో ఉన్న ఎకౌంట్ వెరిఫైడ్ మాత్రం కాదు. దీంతో ట్వీట్లు వేసింది ఆమెనా? కాదా? అన్నది తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Tulasi  MAA President  Shivaji Raja  

Other Articles