Why Ravi Teja's Brother lonely in Death

Raviteja absent bahrat funeral

Ravi Teja, Ravi Teja Brother, Ravi Teja Brother Death, Bharth Raju Death, Bharath Raju Funeral, Bharath Raju Last Rites, Ravi Teja Family, Rabi Teja Family Controversy, Actor Ravi Teja Set A Side Brothers, Ravi Teja Clarity on Bharath Death

Ravi Teja skips his Brother Bharath last rites. Family Sources says After Controversies Mass Raja set a Side his Brothers.

బ్రదర్ భరత్ అంత్యక్రియలకు రవితేజ ఎందుకు రాలేదంటే...

Posted: 06/26/2017 12:57 PM IST
Raviteja absent bahrat funeral

టాలీవుడ్ నటుడు భరత్ శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మధ్యాహ్నాం జరిగిన అంత్యక్రియలకు సోదరుడు రవితేజతోసహా ఫ్యామిలీ సభ్యులు చివరకు తల్లి రాజ్యలక్షి కూడా హాజరు కాకపోవటంపై ఇప్పుడు కొన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.

రవితేజ సోదరుడిగానే ఇండస్ట్రీకి వచ్చిన భరత్ రాజు దాదాపు పాతిక పైగానే సినిమాల్లో నటించాడు. చివరిసారిగా 2016 లో ఆ ముగ్గురు అనే మూవీలో కనిపించాడు. అయితే ఓ స్టార్ హీరో సోదరుడి మరణాన్ని కేవలం కవరేజ్ తోనే సరిపెట్టిన మీడియా పెద్ద హడావుడి చేయకపోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం. బహుశా గతంలో పలు వివాదాలతో మీడియాలో నానిన నటుడి గురించి నెగటివ్ గా ఇవ్వటం సరికాదన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే కుటుంబ సభ్యులు మరీ అంత దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటసలు?

భరత్ అంత్యక్రియలను సోదరుడు మూర్తి రాజు నిర్వహించాడు. తండ్రి, సోదరుడు రవితేజ ఇలా ఎవరూ హాజరు కాలేదు. పై పెచ్చు ఇండస్ట్రీ నుంచి జీవిత రాజశేఖర్, అలీ, రఘుబాబు లాంటి వాళ్లు కనిపించారు. కొంత మంది సన్నిహితులు చెబుతున్నది ఏంటంటే... ఫ్యామిలీ దృష్టిలో భరత్ మీద ఎప్పుడూ అంత ప్రేమాభిమానాలు చూపించేవాళ్లు కాదని, అందుకే తప్పుడు దోవలో పయనించారని, ఆపై ఆ గ్యాప్ మరింత పెరిగిందని... కానీ, ఎంత ద్వేషాలున్నా ఇలాంటి సమయంలో కూడా రవితేజ కుటుంబం హాజరుకాకపోవటంపై మాత్రం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Actor Bharath Death  Controversy  

Other Articles