Airlift Real Hero Matthunny Mathews dies in Kuwait

The real life airlift hero dies at 81

Airlift, Airlift Movie, Airlift Real Hero, Matthunny Mathews, Toyota Sunny, Toyota Sunny Real Life, Toyota Sunny Airlift, Airlift Movie 2016, Airlift Movie Inspiration, Airlift Real Story, Akshay Kumar Airlift Real Hero, Matthunny Mathews Akshay Kumar, Kuwait Business Man Airlift, Kerala AIrlift Man, Airlift Matthunny Mathews Death, Airlift Real Hero Death, Akshay Tribute Airlift Real Hero, Bollywood Death News, Keral CM Pinarayi Vijayan Matthunny Mathews

Businessman Who Inspired 'Airlift' Matthunny Mathews AKA Toyota Sunny Passes Away. Akshay Kumar Mourns the demise of Matthunny Mathews, who inspired his role in 'Airlift'.

ఎయిర్ లిఫ్ట్ రియల్ హీరో కన్నుమూత

Posted: 05/22/2017 08:19 AM IST
The real life airlift hero dies at 81

గతేడాది మొదట్లో బాలీవుడ్ లో వచ్చిన ఎయిర్ లిఫ్ట్ సినిమా గుర్తుందా? కువైట్ ఇరాక్ యుద్ధం సందర్భంగా అక్కడ చిక్కుకుపోయిన లక్షల మంది భారతీయులను రక్షించేందుకు ఓ బడా వ్యాపావేత్త తన ప్రాణాలకు తెగించి ఎలా కాపాడాడో అన్న కథనంతో తెరకెక్కిందా చిత్రం. విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. అక్షయ్ కుమార్ హీరోగా రాజా కృష్ణ మీనన్ అనే యంగ్ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ఓ రియల్ కథ అని చాలా మందికి తెలుసు.

దీనికి ఇన్సిపిరేషన్ అయిన రియల్ హీరో మథున్నీ మాథ్యుస్ ఇక లేడు. 81 ఏళ్ల మాథ్యుస్ శుక్రవారం రాత్రి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్ లో ప్రముఖ
వ్యాపారవేత్త అయిన మాథ్యూ టయోటా సన్నీగా పేరు పొందాడు. 1990 గల్ఫ్ యుద్ధం సమయంలో అక్కడ చిక్కుకుపోయిన 1.50 లక్షల మంది భారతీయులకు ఆహారం, వసతి సౌకర్యాలతోపాటు వారిని సురక్షితంగా
ఇండియాకు తిరిగి వచ్చేలా ఎంతో కృషి చేశాడు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో ఇండియా తరపున అతిపెద్ద రెస్య్కూ ఆపరేషన్ గా ఇది చరిత్రలో నిలిచిపోగా, ఈయన కథ ఆధారంగా ఎయిర్ లిఫ్ట్ తెరకెక్కింది.

కాగా, మథున్నీ మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాథ్యూ తన జీవితాన్ని పణంగా పెట్టి భారతీయులను రక్షించారని, అన్నీ కోల్పోయారని, ఆయన చేసిన సేవలను ఎప్పటీకి మర్చిపోలేమని కేరళ ముఖ్యమంత్రి అన్నారు. కేరళ లోని కుంబనాథ్ ప్రాంతానికి చెందిన మాథ్యూ ఇరవై ఏళ్ల వయసులో ఉద్యోగం నిమిత్తం కువైట్ వెళ్లారు. నాటి నుంచి ఆయన అక్కడే స్థిరపడిపోయారు. మాథ్యూ మృతి చెందడంపై అక్షయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం వ్యక్తం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airlift Movie  Toyota Sunny Matthunny Mathews  Death News  

Other Articles