Malaika Arora No Alimony Sought from Arbaaz Khan

No alimony for malaika arora from arbaaz

Arbaaz Khan Malaika Arora, Arbaaz Khan, Malaika Arora, Malaika Arora, Arbaaz Khan Divorce, Malaika Arora Alimony, Bollywood Couple 2017, Divorce Bollywood Couple, Malaika Rare Divorce Feet

Arbaaz Khan Malaika Arora divorced after 17 years of marriage. Malaika no alimony sought from Khan Brother.

బాలీవుడ్ లో మలైకా-ఆర్బాజ్ రేర్ విడాకులు

Posted: 05/12/2017 03:46 PM IST
No alimony for malaika arora from arbaaz

17 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెంచేసుకుని అఫీషియల్ గా నిన్న విడాకులు తీసేసుకన్నారు ఆర్భాజ్ ఖాన్, మలైకా అరోరాలు. ముంబైలోని బాంద్రా కోర్టు వీరిద్దరికీ అధికారికంగా విడాకుల నోటీసు జారీ చేసింది. సల్మాన్ సహా ఇంట్లోని పెద్దలు, సన్నిహితులు అంతా కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, విడిపోవాలనే వీళ్లు డిసైడ్ అయ్యారు.

అయితే, సాధారణంగా ఇలా విడిపోయే సమయంలో విడాకులు తీసుకోవటం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. కానీ, అర్భాజ్ నుంచి ఒక్క పైసా భరణం కూడా మలైకా అరోరా అడగలేదట. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది మీడియాకు తెలిపాడు. అర్జున్ కపూర్ తో మలైకా సానిహిత్యమే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందని, కాదు.. ఆర్బాజ్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండటమే వీరిమధ్య భేదాభిప్రాయలు రావటానికి కారణమంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసినా ఏది నిజం అనేది ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది.

ఇక తన భార్య సుసానేకు ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ భరణం కింద రూ. 200 కోట్లు ఇచ్చాడు. అయితే, మలైకా మాత్రం పైసా భరణం తీసుకోకపోవటం చర్చగా మారింది. ఇక విడిపోయాక కూడా కలవటం ఈ జంట ఎప్పటి నుంచో చేస్తున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ షోకి, ఆపై మాల్దీవుల హాలీడేస్ కు ఇద్దరి కుటుంబాలు కలిసే వెళ్లటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaika Arora  Arbaaz Khan  Bollywood Couple  

Other Articles