Director Cheran Comments on Baahubali 2

Kollywood director comments on baahubali 2

Director Cheran, Cheran Baahubali 2, Kollywood Director Baahubali 2 Success, Baahubali 2 Jealousy, Kollywood Baahubali 2 Success, Baahubali Kollywood, Baahubali Inspiration, Baahubali Crazy Projects, Baahubali 2 Success Tamil Industry

Kollywood Director Cheran Interesting Comments on Baahubali 2 Success. Tamil Cinema Industry should make Moive Morethan Baahubali

బాహుబలి-2 పై కోలీవుడ్ దర్శకుడి వ్యాఖ్యలు

Posted: 05/12/2017 03:05 PM IST
Kollywood director comments on baahubali 2

1200 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి-2' అఖండ విజయం సాధించడంతో దేశం మొత్తం నీరాజనాలు పడుతున్న సంగతి చూస్తున్నాం. హాలీవుడ్ మీడియా, బాలీవుడ్, సీనియర్ దర్శక దిగ్గజాలు ఇలా అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం తమ కుళ్లును బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఓ ప్రాంతీయ భాషా చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడమే వారిని ఇలా తీవ్ర నిరాశలోకి నెట్టేసిందనుకోవచ్చు.

కన్నడ, కేరళలో వస్తున్న కలెక్షన్ల భీభత్సం పై కొందరు అక్కసు వెల్లగక్కాగా, ఇప్పుడు కోలీవుడ్ కు కూడా ఆ సెగ తాకింది. అక్కడ వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడంతో దర్శక నిర్మాతలు తీర్మానాలు చేసుకుంటున్నారు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ దర్శకుడు చెరన్ అయితే ఓపెన్ గా కామెంట్లు చేసేశాడు. బాహుబలి-2 ను బీట్ చేసేలా భారీ చిత్రాలు తీయాలంటూ తోటి వారికి పిలుపునిచ్చాడు. మన దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి. పౌరాణిక గాథలకు మనం పెట్టింది పేరు. తలుచుకుంటే బాహుబలిని మించే ప్రాజెక్టు తీయొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఈ ప్రాజెక్టు ప్రేరణతో దేశంలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులు రూపొందించేందుకు పలువురు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బాహుబలిని ఆదర్శంగా తీసుకుని అన్న కోణంలో కాకుండా మనమేం తక్కువ అన్న చందాన ఈ టాలెండెడ్ దర్శకుడు చేసిన కామెంట్లు అక్కడి దర్శకుల మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తున్నట్లేగా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Director Cheran  Baahubali 2 Success  

Other Articles